నవంబర్ 23. క్రైమ్ 9 మీడియా తెలంగాణ ప్రతినిధి.
మేడ్చ ల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ ఆధ్యక్షుడిగా తోటకూర వజ్రెష్ యాదవ్ ను అధిష్టానం నియమించారు.
జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి బోడుప్పల్లోని నివాసంలో కలిసి వజ్రేష్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ తోటకూర వజ్రేశ్ యాదవ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలు మరింత బలోపేతం అవుతుందని పార్టీ కార్యకలాపాలు ప్రజలకు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరే విధంగా పార్టీపరష్టమైన ప్రజా పథకాలు ముందుకు సాగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో పార్టీ బలోపేతానికి అందరము కలిసి చేస్తామని జిల్లా నాయకత్వానికి రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జంగా చారి ,వంగూరి పరమేష్, పవన్, పాండురంగారెడ్డి, సతీష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
