క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ :23
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హ ఆదేశాల మేరకు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే అందించిన మానవ సేవ–మానవతా విలువలను స్మరించుకుంటూ, శతజయంతి (100వ జన్మదినోత్సవ) కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని,“ప్రేమస్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహం మనందరిపై, మన కుటుంబాలపై ఎల్లప్పుడూ కురవాలని మనసారా కోరుకుంటూ, స్వామివారి శతజయంతి శుభాభినందనలు తెలియజేస్తున్నాము.”
కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.అశోక్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.సేవ, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వంటి విలువలను పాటిస్తూ ప్రజలకు మరింత సేవ చేయడానికి సిబ్బంది సంకల్పబలం వ్యక్తం చేశారు.
