మహిళా–బాలల భద్రత, గంజాయి నిర్మూలన & సైబర్ నేరాల నియంత్రణపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి.


 మహిళా–బాలల భద్రత, గంజాయి నిర్మూలన & సైబర్ నేరాల నియంత్రణపై జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి.

గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కీలక సూచనలు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ :25. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలలు, వృద్ధులు సురక్షితంగా ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు (GMSKs) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మహిళా భద్రత & మిస్సింగ్ ఉమెన్ ట్రాకింగ్ – ముఖ్య ఆదేశాలు

*ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ—* 

తమ మండలాల్లో మిస్సింగ్ మహిళల వివరాలను సేకరించి, గుర్తించి, నమోదు చేయాలి, మరియు అవసరమైనప్పుడు పోలీసులకు తెలియజేయాలన్నారు.

మిస్సింగ్ కేసులకు సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ / మొబైల్ ధృవీకరణ వంటి అంశాలను ఆన్‌లైన్‌లో వెరిఫై చేయాలి అన్నారు.

సేకరించిన సమాచారం జిల్లా పోలీస్ డేటాబేస్‌లో భద్రపడి, సామాజిక భద్రతకి ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

చైల్డ్ మ్యారేజ్‌లను (బాల్య వివాహాలు) ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని, ఏ అనుమానం వచ్చినా వెంటనే SHOలకు సమాచారం ఇవ్వాలని హెచ్చరించారు.

NDPS నియంత్రణ – అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు

మాదకద్రవ్యాలు, గంజాయి, అక్రమ రవాణా, అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం తక్షణమే స్థానిక పోలీసులకు అందించాలి అన్నారు.

గ్రామస్థాయి వరకు డ్రగ్ అవగాహన కార్యక్రమాలు, Say No to Drugs ప్రచారాలు నిత్యం నిర్వహించాలని తెలిపారు.

సైబర్ ఫ్రాడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మోసపూరిత లింకులు ఓపెన్ చేయవద్దని అవగాహన కల్పించాలి అన్నారు.

మహిళలపై నేరాలు, NDPS, సైబర్ నేరాలు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన పోస్టర్లను స్కూల్స్, కాలేజీలు, అంగనవాడీలు, బస్ స్టాప్‌లు, జంక్షన్లు వంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా చేరవేయాలని ఆదేశించారు.

GMSKs పాఠశాలలు, కాలేజీలకు నియమిత సందర్శనలు చేసి విద్యార్థులకు శక్తి యాప్ ప్రయోజనాలను వివరించి రిజిస్ట్రేషన్లు చేయించాలి అని సూచించారు.

ప్రతిభ కనబరిచిన గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు అభినందనలు.

జిల్లాలో అత్యుత్తమ సేవలు అందించిన GMSKs —

కె.ఉమా (అనకాపల్లి టౌన్), పి.నయోమి (కసింకోట), పి.వీరలక్ష్మి (ఎలమంచిలి రూరల్), ఎం.అరుణ (పరవాడ), ఈ.రాజేశ్వరి (మాకవరపాలెం), పి.లలిత (నాతవరం) — వీరికి జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులు అందజేసి అభినందించారు.

సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచనలు...

అన్ని SHOs, GMSKs, గ్రామస్థాయి సిబ్బంది కలిసి మహిళా–బాలల భద్రత, NDPS నిర్మూలన, సైబర్ క్రైమ్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలి అన్నారు. కార్యక్రమాలలో ఏవైనా సమస్యలు ఎదురైతే SHOలకు నేరుగా నివేదించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు— మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు,ఎస్.బి ఇన్స్పెక్టర్లు బాలసూర్యరావు, లక్ష్మి, వివిధ మండలాల గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post