స్థానిక ఎన్నికల్లో యాదవుల సత్తా చాటాలి.

స్థానిక ఎన్నికల్లో యాదవుల సత్తా చాటాలి.

క్రైమ్ 9మడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్: 25.

కె కోటపాడు - రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవ సంఘం సత్తా చూపించాలని జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు భరణికాన బాబురావు అన్నారు. సోమవారం మండల కేంద్రం కే కోటపాడు లో మాడుగుల నియోజకవర్గస్థాయి యాదవ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాపరంగా అధిక శాతం ఉన్న యాదవ గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీటీసీలుగా గెలుపొందాలని అన్నారు. అనకాపల్లి జిల్లాలో యాదవ విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందించి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో యాదవులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. మిగిలిన కులాలను కలుపుకుంటూ రాజకీయంగా ఆర్థికంగా బలపడాలని కోరారు. అనంతరం కే కోటపాడు దేవరాపల్లి చీడికాడ మాడుగల మండలాల కార్యవర్గాన్ని నియోజకవర్గ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సబ్బి శ్రీనివాసరావు భరణకాన నరసింహమూర్తి కరక సోమనాయుడు పంచదార్ల సూరిబాబు గజ్జి గంగాధర్ చల్ల నానాజీ ఎలమంచిలి ధర్మారావు నంబారు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post