మహిళా విద్యార్థుల పట్ల అసభ్య భావజాలంతో మాట్లాడుతున్న, ప్రవర్తిస్తున్న నారాయణ స్కూల్ ఏలూరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్ఎఫ్ఐ ) డిమాండ్.

మహిళా విద్యార్థుల పట్ల అసభ్య భావజాలంతో మాట్లాడుతున్న,   ప్రవర్తిస్తున్న నారాయణ స్కూల్ ఏలూరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి విద్యార్థి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( ఎస్ఎఫ్ఐ ) డిమాండ్.

 నారాయణ విద్యాసంస్థల డీన్ రమేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేయాలి జంగారెడ్డిగూడెం మండల కమిటీ ఎస్ఎఫ్ఐ.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

 నవంబర్ 16 జంగారెడ్డిగూడెం జగజీవన్ గారి విగ్రహం వద్ద నారాయణ విద్యాసంస్థలు మహిళల పట్ల చూపిస్తున్న అసభ్యకర భావజాల మాటలు మరియు ఎస్ఎఫ్ఐ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి, మండల కమిటీ సభ్యులు పి నాని అధ్యక్షత వహించగా మండల కార్యదర్శి డి నాగేంద్రబాబు మాట్లాడుతూ 

 ఏలూరులో నారాయణ విద్యా సంస్థ లో మహిళల విద్యార్థుల పట్ల అసభ్యకర భావజాలాలతో మాట్లాడి దూషించిన డీన్ రమేష్ పై సుమోటోగా కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్య శాఖ అధికారులను డిమాండ్ చేశారు అనేక ప్రకటనలో అసభ్యకర భావజాలాలతో మాట్లాడాలని చెప్పి ప్రచారాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు రమేష్ పై చర్యలు తీసుకోకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు అనుమతి లేకుండా జూనియర్ కళాశాలలో హైస్కూల్లో రన్ చేయడం గత సంవత్సరం నుండి అధికారులకు అర్జీలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అనేకసార్లు విద్యార్థి సంఘాలుగా ఫిర్యాదు చేసినప్పటికీ ఒక వారం పది రోజుల్లో చర్యలు తీసుకుంటామని వాగ్దానాలు ఇచ్చి కాలయాపన చేస్తున్నారు తప్ప నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడంలో మరమత్తు ఏమిటో అధికారులు బహిరంగంగా సూచించాలని తెలిపారు గతంలో మెరిట్ ఎగ్జామ్స్ కి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఉత్తర్వులను ఉల్లంఘించి ఇష్టానుసారం వ్యవహరించారని దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించక పోవడం దుర్మార్గమని ఎప్పటికైనా అధికారులకు సిద్ధ శుద్ధి ఉంటే తక్షణమే వీటన్నిటిపై ఎంక్వయిరీ జరిపి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరింత నిరసన కార్యక్రమాలు ఉద్యమాలకు విద్యార్థి,యువజన, ప్రజాసంఘాలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post