మెప్మా ఎం.డి ఇచ్చిన సర్కులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని యూనియన్ గౌరవాధ్యక్షులు బి. సోమయ్యడిమాండ్.



   మెప్మా ఎం.డి ఇచ్చిన సర్కులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని యూనియన్ గౌరవాధ్యక్షులు బి. సోమయ్యడిమాండ్.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు, నవంబర్, 16:ఏలూరు నగర మెప్మా ఆర్పీల సంఘం జనరల్ బాడీ సమావేశం ఏలూరు ఆర్.ఆర్ పేట లో గల శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో శ్రీమతి ఎ.ఇందిరా దేవి అధ్యక్షతన నేడు జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులు బి. సోమయ్య పాల్గొని మాట్లాడుతూ ఇటీవల మెప్మా ఆర్పీలకు విపరీతమైన పని భారం పెంచుతూ ఎం.డి ఆదేశాలు ఇచ్చారని, పెంచిన పనిభారాలు చేయకపోతే జీతాల్లో కోతలు విధిస్తామని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పనిభారాలు పెంచి,జీతాల్లో కోత విధించాలనే మెప్మా ఎం.డి ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెంచిన పనిభారాలు, జీతాల్లో కోతలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. పనిభారాల పెంపు, జీతాల్లో కోతల పై ఈనెల 18వ తేదీన ఏలూరు జిల్లా మెప్మా పీ.డీకి వినతి పత్రం ఇస్తామని ఆయన తెలిపారు. గత రెండు నెలలుగా మెప్మా ఆర్పీలకు నెలకు 10 వేల రూపాయలు జీతం రావాల్సి ఉండగా 4 వేల నుండి 5 వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయని,ఇప్పుడు మరింత పని భారం పెంచి, జీతాల్లో కోత విధిస్తామని ఆదేశాలు ఇవ్వడం చాలా దారుణమని ఆయన విమర్శించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం భవిష్యత్తులో నెలంతా కష్టపడ్డా ఆర్పీలకు ఒక వేయి రూపాయలు జీతం కూడా రాని పరిస్థితి నెలకొంటుందని ఆయన తెలిపారు. మెప్మా ఆర్పీలందరూ పనిభారానికి,జీతాలకు లింకు పెడుతూ ఎం.డి ఇచ్చిన ఆదేశాల ఉపసంహరణకై సంఘం చేపట్టే ఆందోళనలో మెప్మా ఆర్పీలు అందరూ పాల్గొవాలని ఆయన కోరారు.ఇంకా ఈ సమావేశం మెప్మా ఆర్పీలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యూనిఫారం ఇవ్వాలని, కనీస వేతనాలు 26 వేలకు పెంచాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ వేర్వేరు తీర్మానాలు ఆమోదించింది.

సమావేశం నిర్ణయాలను ఆర్పీల యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ఎస్.ఉన్నీసా పత్రికలకు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ మెప్మా ఆర్పీలు అందరూ ఐకమత్యంగా 26వేలు కనీస వేతనం కోసం, పనిభారాలు, జీతాలలో కోతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని తెలిపారు. ఆర్పీలు మీ సమస్యలపై చేపట్టే ఆందోళనకు ఐఎఫ్టియు అనుబంధ సంఘాలన్నీ మద్దతుగా నిలుస్తాయని తెలియజేశారు. 

 ఈ క్రింది వారితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా బి.సోమయ్య, సంఘం అధ్యక్షురాలుగా ఏ.ఇందిరా దేవి, ఉపాధ్యక్షురాలుగా ఎన్. నాగమణి, ప్రధాన కార్యదర్శిగా ఎస్. ఉన్నీసా, సహాయ కార్యదర్శిగా పి.నాగదుర్గ, కోశాధికారిగా పి.జయలక్ష్మిలను, మరో 10 మంది కమిటీ సభ్యులుగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. 

Post a Comment

Previous Post Next Post