ఏలూరు ఆదివారపు పేటలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం.
ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
ఏలూరు, నవంబర్16 :- ఏలూరు ఆదివారపు పేటలో ప్రతి ఏడేళ్ళకోసారి వైభవంగా నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పండుగ వాతావరణం లో జరిగిన ఈ వేడుకల్లో శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర ఆరంభానికి సూచికగా ముడుపు కట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మీనా దంపతులు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ "భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారి ఆశీస్సులతో ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి చేతుల మీదుగా గంగానమ్మ అమ్మవారి సంబరాలు జరుపుకోవడం ఆనందదాయకం అని అన్నారు. ఏలూరు నియోజకవర్గం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భక్తులు కూడా అమ్మవార్లను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలని ఆయన సూచించారు".. ఈ కార్యక్రమంలో ఆదివారపు పేట జాతర కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.. శక్తి వేషాలు, డప్పు వాయిద్యాలు, సాంప్రదాయ కళా రూపాలతో జాతర ప్రాంతం పండుగ వాతావరణం కళకళలాడింది..
.jpg)


