పేకాటా, కోడిపంధాలపై కోరాడ జులిపిస్తున్న ఏలూరు ఎస్ పి. కె. ప్రతాప్ శివ కిషోర్.
క్రైమ్ నైన్ మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.ఏలూరు డిఎస్పి డి శ్రావణ్ కుమార్ యొక్క ఆదేశాలపై భీమడోలు సిఐ యు జే విల్సన్ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు అనగా 25.11.2025 వ తేది నాడు ద్వారక తిరుమల ఎస్ఐ సుధీర్ రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో కలిసి ద్వారక తిరుమల మండలం జజుల కుంట గ్రామం శివారులో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించగా 06 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 03 మోటార్ సైకిల్స్ 19,300/- రూ.లను స్వాధీనం చేసుకొని వారిపై ద్వారక తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ సుధీర్ తెలియ చేసినారు.
ఈ సందర్భంగా ద్వారక తిరుమల ఎస్ఐ సుధీర్ మాట్లాడుతూ గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు అనగా కోడి పందాలు, పేకాట లు నిర్వహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా కోడిపందాలు గాని పేకాట లు నిర్వహిస్తున్నటు వంటి సమాచారాన్ని డయల్ 112 కు గాని లేదా ద్వారక తిరుమల ఎస్ఐ యొక్క ఫోన్ నెంబర్ 9440796653 నకు సమాచారం అందించిన ఎడల చట్ట ప్రకారం జూదరు లపై చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా తెలియ చేసినారు.
