'శక్తి యాప్'పై అవగాహన ను కల్పించిన ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్య చంద్రరావు.
ఏలూరు. క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
నవంబర్. 25. సి ఆర్ రెడ్డి మహిళా కాలేజీ లో ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరులోని సి ఆర్ రెడ్డి కాలేజీ విద్యార్థినీలకు 'శక్తి యాప్' మరియు భవిష్యత్తు పై అవగాహన కార్యక్రమం నిర్వహించినారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. భవిష్యత్తు మార్గదర్శకం విద్యార్థులు తమ చదువుల సమయంలో నిబద్ధత, కష్టపడి చదవడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు సాధించి మెరుగైన భవిష్యత్తును పొందగలరని అదనపు ఎస్పీ అడ్మిన్ గారు సూచించారు.చదువుతో పాటు క్రమశిక్షణ, లక్ష్యంపై దృష్టి పెట్టడం అత్యంత ముఖ్యమన్నారు.
మహిళలు, బాలికల భద్రత కోసం రూపొందించిన 'శక్తి యాప్' అనేది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం అందించే మొబైల్ అప్లికేషన్ అని వివరించారు. ప్రతి విద్యార్థి యొక్క తల్లి దండ్రులు యొక్క ఫోన్లలో ఈ యాప్‌ను తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రమాదం లేదా వేధింపుల సమయంలో తక్షణ సహాయం కోసం డయల్ 112 (తక్షణ సేవలు), మహిళా హెల్ప్‌లైన్ 181 (న్యాయ సలహాలు), మరియు శక్తి యాప్ నంబర్ 7993485111 వినియోగించుకోవాలని కోరారు.
ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఇమిడిపోయి సెల్ ఫోన్ లు ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్ కి అలవాటు పడిన నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు విద్యావంతులు అని గాని సమాచార లోపం వలన గాని అవకాశాలను అందిపుచ్చుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు, విద్యార్థినిలు తగిన జాగ్రత్తలను తీసుకుంటూ సోషల్ మీడియాని వినియోగించాలని అపరచత వ్యక్తులతో సంభాషణ గాని లేదా మీ యొక్క ఫోన్ నెంబర్లను గాని ఇవ్వడం మంచిది కాదని ముందుగా స్నేహంగా మాట్లాడి తర్వాత మీ యొక్క సమాచారాన్ని సేకరించి మీపై బ్లాక్మెయిలింగ్ కి పాల్పడతారని డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తారని అలా బెదిరించిన యెడల వెంటనే 1930 కి సమాచారం అందించగల మీకు సైబర్ సెల్ సిబ్బంది సహాయ సహకారాలను అందిస్తారని ప్రతి ఒక్కరు గమనించాలని అదన పరిస్థితి అడ్మిన్ గారికి తెలియ చేసినారు.
*సమాజంలో ఎదురయ్యే సమస్యలు, తమ భద్రత గురించి విద్యార్థులు ఎల్లప్పుడూ అవగాహనతో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై నాగమణి , సి ఆర్ రెడ్డి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మరియు శక్తి టీమ్ సభ్యులు పాల్గొన్నారు.


