ఏలూరులో విభిన్న ప్రతిభావంతులు క్రీడోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి).
క్రీడోత్సవాలలో ఉత్సాహముగా పాల్గొని ప్రతిభను చాటిన విభిన్న ప్రతిభావంతులు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, నవంబర్, 25 :విభిన్న ప్రతిభావంతుల క్రీడోత్సవాలు ఏలూరు అల్లూరి సీతారామ రాజు స్టేడియం నందు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 82 రకాల క్రీడలతో నిర్వహించబడుట జరిగినది. క్రీడోత్సవాలను స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో స్థానిక శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, (చంటి) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, (చంటి) మాట్లాడుతూ అవకాశం , తగిన ప్రోత్సాహం ఇస్తే విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలో రాణిస్తారని, వారిని ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని , వాటిని అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
విభిన్న ప్రతిభావంతులు అత్యంత ఆనందంగా ఈ క్రీడోత్సవాలలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సదరు క్రీడలలో విజేతలకు విభిన్న ప్రతిభావంతులను సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్ బహుమతులు అందించి, అభినందించారు.
ఏలూరు జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల నుండి దాదాపు 700మంది విభిన్న ప్రతిభావంతులు, సదరు క్రీడా పోటీలకు హాజరయ్యారు. . , వీరిలో అంధ, బధిర, శారీరక మరియు మానసిక విభిన్న ప్రతిభావంతులకు సంబంచించిన స్వచంద సేవా సంస్థల నుండి శ్రీ శ్రీనివాస రెడ్డి, శ్రీ హెన్రీ డొమినిక్, శ్రీ ఏ.వెంకట రమణ, మరియు విభిన్న ప్రతిభావంతుల సంఘాల ప్రతినిధులు వీరభద్రరావు, జాకబ్ , భూషణం , ప్రవీణ్ వర్మ ప్రభృతులు పాల్గొన్నారు. వ్యాయమ ఉపాధ్యాయులు షణ్ముఖం క్రీడాపోటీలను పర్యవేక్షించారు.


