రామకోటి మైదానం ప్రాంగణంలో సర్వమాలధారణ స్వాములకు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న భిక్షా కార్యక్రమం.




 రామకోటి మైదానం ప్రాంగణంలో సర్వమాలధారణ స్వాములకు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న భిక్షా కార్యక్రమం.

ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన జనసేన నాయకులు నారా శేషు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

నవంబర్ 02 :- ఏలూరు నియోజకవర్గంలోని రామకోటి మైదానం ప్రాంగణంలో సర్వమాలధారణ స్వాములకు అన్నపూర్ణ సమేత హరహర పుత్ర అయ్యప్ప సమాజం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్విరామంగా భిక్ష కార్యక్రమం కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన ఈ భిక్ష కార్యక్రమానికి పత్స ఫణిరాజ్, లీలా సంతోషి దంపతులు, యార్లగడ్డ సతీష్, గ్రీష్మ దంపతులు, పోలవరపు సాయి సీతారాం నీలిమ దంపతులు భిక్ష ప్రదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు నారా శేషు గారు హాజరయ్యారు. అయ్యప్ప మాలధారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు. భిక్ష ప్రదాతలను, జనసేన నాయకులు నారా శేషు గారిని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అందరూ సుఖశాంతులతో ఉండేలా ప్రత్యేక ప్రార్థనలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప దీక్షను చేపట్టిన స్వాములకు, భక్తులకు, సర్వ మాలధారణ స్వాములకు, భక్తిశ్రద్ధలతో నారా శేషు గారి చేతుల మీదుగా భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. భిక్ష ప్రదాతలు భిక్షను వడ్డించి స్వాముల ఆశీర్వాదాలు అందుకున్నారు. సమాజానికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను నారా శేషు  అభినందించారు. ఈ కార్యక్రమంలో తనను పిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వ మాలధారణ స్వాములు భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గురు స్వాములు సర్వమాల ధారణ స్వాములు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో అన్నదాన కమిటీ సభ్యులు కొట్టు మధు , కొట్టు మనోజ్ , మేడిచర్ల శ్యామ్, బండ్రెడ్డి వాసు, సూరిబాబు, పలువురు గురు స్వాములు, భారీ సంఖ్యలో సర్వ మాలధారణ స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post