మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీనివాస్.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఆదివారం ఉదయం ఎక్సైజ్ పోలీసులు నోటీసులు అందజేసి అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున 5:30 గంటలకు చేరుకున్న పోలీసులు జోగి రమేష్ ఇంటి నుంచి బయటకు వచ్చేవరకు వేచి చూశారు. 8:00 కు జోగి రమేష్ బయటకు రాగా పోలీసులు ఆయనతో మంతనాలు జరిపి అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో ఎక్కించి విజయవాడ వైపు తరలించారు. గురునానక్ కాలనీ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.
