ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకే ప్రభుత్వ నిరంకుశ వైఖరి.

ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకే ప్రభుత్వ నిరంకుశ వైఖరి. 

 కావ్య మరణానికి న్యాయం చేయాలని అడిగిన విద్యార్థి యువజన దళిత సంఘాల నాయకులపై అక్రమ కేసులు సరికాదు - డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్య కిరణ్.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

 నవంబరు 29 జంగారెడ్డిగూడెం టౌన్ పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల కార్యాలయంలో విద్యార్థి, యువజన, కార్మిక,దళిత, సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది,

 ఈ కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్య కిరణ్ అధ్యక్షత వహించగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగభూషణం, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి డి నాగేంద్ర సిఐటియు టౌన్ కన్వీనర్ పి, సూర్యరావు, ప్రజా పోరాట సమితి నాయకులు, సుందరం, , తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ..జంగారెడ్డిగూడెం మండలం గురుకుల పాఠశాలలో కావ్య ఆత్మహత్య సంఘటనను పరిశీలించి కావ్య కుటుంబానికి న్యాయం చేసి దోషులను శిక్షించాలని గొంతెత్తిన వారిపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించడం సరికాదని 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడితే సమగ్ర న్యాయ విచారణ జరిపి కారుకులైన వారిని చట్టబద్ధంగా శిక్షించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని 

 అలాగే రానున్న రోజుల్లో అన్యాయాన్ని ప్రశ్నించే యువజన, విద్యార్థి, దళిత, కార్మిక, ప్రజాసంఘాల నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి శాంతియుతంగా పోరాటాలు నిర్వహించిన వారిపై అక్రమ కేసులు బనాయించి పోరాటాలను అణిచివేయలేరని న్యాయం జరగాలని కోరిన ప్రజాసంఘాల నాయకులను అధికారులు వ్యక్తిగత వివరాలు అడగడం కొంతమందిని బెదిరింపులకు పాల్పడడం కావ్య ఆత్మహత్య పై మరింత అనుమానాలు లేవనెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు,

 కావ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తరువాత ఆసుపత్రికి తీసుకువెళ్లారని ఆస్పత్రికి తరలించే క్రమంలోనే కావ్యం మృతి చెందినట్లు తెలియజేశారని మరొకవైపు కనీసం పేరెంట్స్ కమిటీకి సమాచారం ఇవ్వకపోవడం, స్కూల్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ప్రిన్సిపల్ రూములో కొన్ని నిమిషాల పాటు ఆగుతూ ఉండడం కావ్య మరణానంతరం సూసైడ్ లెటర్ కనిపించిందని చెప్పడం, మైనర్ బాలిక ఆత్మహత్యను న్యాయ విచారణ జరపవలసిన ఉన్నత అధికారులు ఆఫీసులు చుట్టూ తిప్పుకోవడం వెనుక ప్రజలకు ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులకు మరింత అనుమానాలకు దారితీస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారని తక్షణమే కావ్య ఆత్మహత్య పై సమగ్ర దర్యాప్తు జరిపించి చదువుతున్న విద్యార్థులకు భరోసా కల్పించాలని 

 న్యాయం జరగాలని గొంతేత్తిన ప్రజాసంఘాల నాయకుల పై పై పెట్టిన అక్రమ కేసులకు యువజన,విద్యార్థి, దళిత, ప్రజా సంఘాలు తలగేది లేదని ఎప్పటికైనా కావ్య ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు న్యాయ విచారణ చేయాలని లేని పక్షంలో సంబంధిత అధికారులపై, జిల్లా కలెక్టర్, ఎస్పీ, హ్యూమన్ రైట్స్, ఎస్సీ ఎస్టీ కమిషన్, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా అక్రమ కేసులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేసేంతవరకు పోరాటాలు కొనసాగిస్తామని లేని పక్షంలో ప్రైవేట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు  

 ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వంగ గోపి, పి రమేష్, ఏ ప్రభాకరరావు, రాజశేఖర్, రవితేజ, శాంతి కుమార్, నాని, ఆశీర్వాదం, స్టాలిన్, ఆనందరావు, తదితరులు పాల్గొని మాట్లాడారు.

Add


Post a Comment

Previous Post Next Post