రాంబిల్లి మండలంలో విస్తృత రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం.


 రాంబిల్లి మండలంలో విస్తృత రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం.

జిల్లా ఎస్పీతుహిన్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు

       అనకాపల్లి (రాంబిల్లి)నవంబర్ :29 రాంబిల్లి మండల పరిధిలో ఇటీవలి రోజులలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు శనివారం రాంబిల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ స్థాయిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్, డి.టి.ఓ అనకాపల్లి జి.మనోహర్, ఎం.వి.ఐ కె.ప్రవీణ్ కుమార్, రాంబిల్లి సిఐ సిహెచ్.నరసింగరావు ప్రధాన అతిథులుగా హాజరై, డ్రైవర్లు మరియు ప్రజలకు రోడ్డు భద్రతపై విలువైన సూచనలు అందించారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు లారీ డ్రైవర్లు స్కూల్ బస్ డ్రైవర్లు స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు,ఆటో డ్రైవర్లు అధికారులు ప్రతి విభాగాన్ని విడివిడిగా సమావేశమై, రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలు, పాటించాల్సిన ముఖ్య జాగ్రత్తలను వివరించారు.

ప్రధాన సూచనలు & అవగాహన అంశాలు

ట్రాఫిక్ నియమాల ప్రాధాన్యం

హెల్మెట్, సీట్బెల్ట్ వాడకం తప్పనిసరి, ఇవే ప్రాణాలను కాపాడతాయని అధికారులు వివరించారు.

అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలకు కీలక కారణాలని సూచించారు.

అధిక లోడ్ వాహనాలపై ప్రత్యేక హెచ్చరిక

ఇటీవలి రాంబిల్లి ప్రాంతంలో అధిక లోడ్ కారణంగా జరిగిన ప్రమాదాలను ప్రస్తావిస్తూ—

“ఇకపై ఓవర్‌లోడింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎటువంటి రాయితీ ఉండదు.” అని స్పష్టం చేశారు.

స్కూల్ బస్సులపై మార్గదర్శకాలు

స్కూల్ బస్సులకు తప్పనిసరిగా ఉండాల్సినవి:

చెల్లుబాటు అయ్యే ఫిట్‌నెస్ సర్టిఫికేట్

స్పీడ్ గవర్నర్ అమలు

ఫైర్ ఎక్స్టింగ్విషర్

అనుభవజ్ఞుడైన అటెండర్

బాలల భద్రతలో నిర్లక్ష్యం అసలు సహించబోమని స్కూల్ మేనేజ్‌మెంట్‌ను హెచ్చరించారు.

లారీ & ఆటో డ్రైవర్లకు అవగాహన.

అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలి.

మద్యం సేవించి డ్రైవింగ్ పూర్తిగా నిషిద్ధం రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు

అధికారుల సందేశం.

“ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండేందుకు, ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలి. ప్రాణాలను కాపాడేది జాగ్రత్త… నిబంధనలను గౌరవించడం.”

రాంబిల్లి ఎస్సై నాగేంద్ర మరియు స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని, ఇటీవల జరిగిన ప్రమాదాల ఉదాహరణలను వివరించి డ్రైవర్లలో అవగాహన పెంచారు.

Post a Comment

Previous Post Next Post