పేద విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం.



 పేద విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా సింగరాయకొండ

అంబేద్కర్ గురుకులాలు, వసతి గృహాల్లో విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ల ద్వారా సురక్షితమైన త్రాగునీరు.

పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది.

విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు కలలు నెరవేర్చాలి

మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీ.

పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో మంత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మరుగుదొడ్లు, వంటగది పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని సిబ్బందిని ఆదేశించారు.అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ..పేద విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ. 143 కోట్లతో అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు చేశాం. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉమ్మడి జిల్లాకు ఒక వైద్యాధికారి నియమించాం. పాఠశాలలు, వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నాం. విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులు కలలు నెరవేర్చాలి.పేద విద్యార్థులు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Post a Comment

Previous Post Next Post