నవంబరు 26 బుధవారం జంగారెడ్డిగూడెం మీసేవ సెంటర్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్మికులకు హాని కలిగించే లేబర్ నాలుగు కోడ్ లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి వంగా గోపి అధ్యక్షతన జరగగా జి సూర్యకిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ కార్మికులకు తీరని నష్టం వాటిల్లుతుందని బ్రిటీష్ కాలం నుంచి కార్మికులు పోరాడి సాధించిన కార్మికుల హక్కులు చట్టాలను 28 రకాల సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడులుగా ప్రవేశపెట్టడం దుర్మార్గకరమని తక్షణమే కార్మికులకు హక్కులకు భంగం కల్పించే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాకులను కొట్టి గెద్దలకు పెట్టినట్టు కార్మికుల కష్టాన్ని తాకట్టుపెట్టి కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూలుకున్నాయని పని గంటలు 8 గంటలు నుంచి పది గంటలకు పెంచుతూ కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్మిక చట్టాల వల్ల ఉపాధి పెట్టుబడులు పెరుగుతాయని ప్రభుత్వం చేస్తున్న వాదన పూర్తిగా నిరాదారం పెట్టుబడిదారులను రక్షించడం కోసం కార్మికులకు భద్రత లేకుండా ఉండేలా ఈ లేబర్ కోడ్లను రూపొందించారని కార్మికుల హక్కులకు సంబంధించిన వివిధ అంశాల విషయంలో అర్థవంతంగా ఉన్న నియంత్రాణలన్నీ రద్దు చేయబడుతున్నాయని హామీ ఇవ్వడం ద్వారా జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించడం ఈ లేబర్ కోడ్ల ప్రధాన లక్ష్యంగా ఉందని పైగా కార్మిక వర్గం సమ్మె చేసే హక్కులను లాక్కోవాలని, అలాగే కార్మికులు సామూహికంగా చేసే ఏ చర్యనైనా నేరపూరితంగా చేయాలని ఈ కోడ్ లను తీసుకొచ్చారని కనుక కార్మికులకు హాని కలిగించే ఈ లేబర్ కోట్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బి రాంబాబు, ఏ ప్రభాకరరావు, కే సుబ్బారావు స్టాలిన్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
