దళితులకు న్యాయం చెయ్యాలి -దళిత బహుజన నాయకుల డిమాండ్.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికలపూడి గ్రామానికి చెందిన ఎస్సీ మాల కులానికి చెందిన కొణుదుల విజయకు చెందిన ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్ల వ్యవసాయ భూమిని కబ్జా చేసిన తడికలపూడి గ్రామానికే చెందిన కూరాకుల శ్రీనివాసరావు పైన ఆళ్ల రంగారావు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని వారు కబ్జా చేసిన ఐదు ఎకరాల పద్నాలుగు సెంట్ల వ్యవసాయ భూమిని తిరిగి ఎస్సీ మహిళ అయిన కొణుదుల విజయకు అందజేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉదయం 11 గంటలకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బాధితురాలు కొణుదుల విజయ , దళిత బహుజన నాయకులు నేతల రమేష్ బాబు, కాపుదాసు రవి, ఎరికిపాటి విజయ్, కంచర్ల విజయ శేఖర్, కర్రే అంబేడ్కర్, గొల్ల కిరణ్ కుమార్, కర్ణకోటి దిలీప్ కుమార్, పాము రవీంద్ర, తోకల రాజేష్, కే సామ్యేల్ మరియు బాధితురాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

