భారత రాజ్యాంగ దినోత్సవం – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ.


 భారత రాజ్యాంగ దినోత్సవం – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు, సిబ్బందితో ప్రతిజ్ఞ కార్యక్రమం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ 26:

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు ఘటించారు. అనంతరం సిబ్బందితో కలిసి రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల నిలబెట్టుటకై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ

“భారత రాజ్యాంగ ముసాయిదా ప్రతి పై 1949 నవంబర్ 26న తుది సంతకాలు జరిగిన రోజు, మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైనది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి ప్రజలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించే లక్ష్యంతో ముందుకు నడిపింది. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించడం, దాని విలువలను కాపాడుకోవడం అత్యంత బాధ్యత,” అని పేర్కొన్నారు.“ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా రాజ్యాంగ భావాలపై సమాజంలో అవగాహన పెంపొందుతుంది. ఈ విలువలు ప్రతి ఒక్కరి నిత్యజీవితంలో ప్రతిబింబించాలని మనమందరం కృషి చేయాలి,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన్ రావు, ఇన్స్పెక్టర్‌లు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, లక్ష్మి, మల్లికార్జున రావు, ఎస్సై లు ప్రసాద్, శిరీష, అంజి బాబు, ఇతర అధికారులు, ఆఫీస్ సూపర్డెంట్లు ప్రతాప శేషయ్య, గిరి, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post