మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా కంభంలోజనసేన పార్టీ శ్రేణుల సంబరాలు.


 

మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా కంభంలోజనసేన పార్టీ శ్రేణుల సంబరాలు.

మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా కంభంలో జిల్లా కార్యదర్శి లంక నరసింహారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణుల సంబరాలు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
      సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు " మార్కాపురం జిల్లా" ప్రకటించటంతో కంభం టౌన్ లోని శ్రీకృష్ణ మినీ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు 
అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి లంక నరసింహారావు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం లో జరిగిన అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తించి జిల్లా ఇచ్చే బాధ్యతలు నేను తీసుకుంటారని హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి త్వరగా జిల్లా ఇవ్వడంతో మార్కాపురం జిల్లా ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి,మార్కాపురం జిల్లా సాధనలో ప్రధాన పాత్ర పోషించిన గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి, మార్కాపురం జిల్లా ఉద్యమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలు కు ప్రత్యేక ధన్యవాదములు మరియు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య కంభం మండల అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ బేస్తవారిపేట మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ప్రోగ్రాం కమిటీ సభ్యులు మల్లికార్జున కంభం మార్కెట్ డైరెక్టర్ దమ్ము తిరుపాలు మండల నాయకులు సంధు నారాయణ కర్ణ శివ కోళ్ల రమణ బండ్లమూడి బాల ఈశ్వరరావు పాల బత్తిన శ్రీనివాసులు గుర్రాల రామకృష్ణ బండి రంగయ్య బాలరాజు శివశంకర్ మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post