ఏలూరులో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి మహోత్సవం.




ఏలూరులో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి మహోత్సవం.

ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మహానాయకులలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఒకరు.

దౌత్య నైపుణ్యంతో సంస్థానాలు అన్నింటిని మన జాతీయ జెండా కిందకు చేర్చిన గొప్ప దేశభక్తుడు-జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ.

ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి. సన్నీ.

ఏలూరు, నవంబరు 18: స్థానిక ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి మహోత్సవం సందర్భంగా 500 మంది యువత, విద్యార్థులతో ఇండోర్ స్టేడియం గ్రౌండు నుండి ఫైర్ స్టేషన్ వరకు ఘనంగా సర్దార్ @150 యూనిటీ మార్చ్ ర్యాలీని జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా జాయింటు కలెక్టరు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సంస్కృతి కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఒకరిని, ప్రజలంతా జాతీయ ఐక్యతా భావంతో మెలగాలని అన్నారు. అక్టోబరు 31 నుంచి నవంబరు 25 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలో భాగంగా జిల్లా అంతటా అనేక కార్యక్రమాలు జరుగుచున్నాయని అన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా దేశవ్వాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, డ్రగ్స్, మత్తుపదార్థాలు ఎక్కడయినా అమ్మినా, సేవించినా, ప్రోత్సహిoచినా సంబంధిత అధికార్లకు సమాచారం ఇవ్వాలని అన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా ఏలూరును నిలుపుతామని, ప్రతి ఒక్కరూ కృషిచెయ్యాలని కోరారు. విద్యార్థులు విద్యను అభ్యసించే సమయంలో డ్రగ్స్ కు బానిసలు కాకుండా భవిష్యత్తును బంగారుబాటగా మలచుకోవాలని, దేశభవిషత్తు మీచేతుల్లోనే ఉందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.   

జిల్లా ఏఎస్పీ నక్కా సూర్యచంద్ర రావు మాట్లాడుతూ దౌత్య నైపుణ్యం తో 565 సంస్థానాలు అన్నింటిని మన జాతీయ జెండా కిందకు చేర్చిన గొప్ప యోధుడు అన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలోను మంచి సేవలు అందించారని, దేశ స్వాతంత్రం తర్వాత ఉప ప్రధానిగా, కేంద్ర హోం శాఖా మంత్రిగా చేసిన సేవలు స్ఫూర్తిదాయకం అన్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన 182 అడుగులు విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సర్దార్, ఉక్కుమనిషి అని రెండు బిరుదులు ఉన్నాయని, నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడలు యువజన సంక్షేమ, మైభారత్ యువజన అధికారి సుంకర రాము, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, డిఆర్డిఏ పిడి ఆర్.విజయరాజు, సెట్ వేల్ సిఇవో కె.యస్.ప్రభాకర రావు, జిల్లా విభిన్న ప్రతిభావంతులు సంక్షేమ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ డా.జి.గిరిబాబు, పట్టణ ప్రముఖులు, యన్ సిసి, సేవా సంస్థల విద్యార్థులు, యువత, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post