దిశ కమిటీ చైర్మన్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఏలూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం.




 దిశ కమిటీ చైర్మన్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అధ్యక్షతన ఏలూరు జిల్లా అభివృద్ధి  సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం.

ఏలూరు క్రైమ్ 9 మీడియా (ప్రతినిధి) సన్నీ.

 ఏలూరు లొ కలెక్టర్ వారి కార్యాలయం,గోదావరి సమావేశ మందిర లొ    దిశ కమిటీ చైర్మన్  ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్  అధ్యక్షతన ఏలూరు జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం లొ పాల్గొన్న చింతలపూడి శాసన సభ్యులు  సొంగా రోషన్ కుమార్.

 ఈ సమావేశంలో  దిశ కమిటీ చైర్మన్  ఎంపీ పుట్టా మహేష్ కుమార్  పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల సమస్యలన్నీ ఆయా సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు అందులో ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల గురించి వాటిని మరమ్మతులు చేసే విషయమై చాలా ఘాటుగా స్పందించారు 2026 జనవరి నెల నాటికి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో రోడ్ల మరమ్మత్తుల మొత్తం పూర్తి అవ్వాలని అధికారుల ఆదేశించారు, ఏలూరు టు జంగారెడ్డిగూడెం ఫోర్ వే లైన్ కు ప్రతిపాదనలు పంపామని,అలాగే హాస్పిటల్లో వైద్యాధికారుల పనితీరు గురించి హాస్పటల్ సూపరిండెంట్తో సమీక్ష జరిపారు అంబులెన్సులు సకాలంలో అందాలని ఏ వ్యక్తికి వైద్యం నిర్లక్ష్యం కాకూడదని ఇలాంటి తప్పులు ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని ఘాటుగా స్పందించారు, ఆ తర్వాత చింతలపూడి శాసనసభ్యులు మాట్లాడుతూ... నియోజకవర్గం లొ ప్రధాన సమస్య రోడ్లన్నీ పూర్తి అయ్యేలాగా కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను కోరారు,అలాగే నియోజవర్గం నుంచి చింతలపూడి మరియు లింకపాలెం మండలం నుంచి వచ్చిన చింతలపూడి మరియు లింకపాలెం మండలం నుంచి మహిళా సర్పంచులు మరియు దిశ కమిటీ సభ్యులు చీకటి కవిత మరియు నత్త నవ్య దీప్తి పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమం లొ కలెక్టర్ శ్రీమతి విత్ సెల్వి  మరియు జెసి జెసి అభిషేక్ గౌడ్ , ఏలూరు శాసన సభ్యులు  బడేటి రాధాకృష్ణ , దెందులూరు శాసన సభ్యులు  చింతమనేని ప్రభాకర్ , అప్కాబ్ చైర్మన్ మరియు డీసీసీబీ చైర్మన్  గన్ని వీరాంజనేయులు  పాల్గొన్నారు, అలాగే ఈ కార్యక్రమం లొ చింతలపూడి మండలం నుంచి దిశ కమిటీ సభ్యురాలు మల్లాయిగూడెం సర్పంచ్ చీకటి కవిత గారు మరియు లింగపాలెం మండలం వేములపల్లి సర్పంచ్ నత్తా నవ్య దీప్తి  పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post