అభ్యుదయం సైకిల్ యాత్ర” — మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన పేరిట కొత్తకోట నుండి బుచ్చయ్యపేట, చోడవరం వరకు విస్తృత కార్యక్రమాలు.
క్రైమ్అ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్న (క్రైమ్ ). పి. మహేశ్వరరావు.
అనకాపల్లి,(కొత్తకోట) నవంబర్ 16: మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడాన్ని లక్ష్యంగా చేసుకొని విశాఖపట్నం రేంజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న “అభ్యుదయం సైకిల్ యాత్ర” (పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు)
ఈ రోజు కొత్తకోట గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది.
కోతకోట గ్రామంలో సైకిల్ ర్యాలీని చోడవరం ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.రాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, గ్రామ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ—
“మాదకద్రవ్యాల నివారణలో సమాజం మొత్తం బాధ్యతతో ముందుకు రావాలి. సైకిల్ ర్యాలీలు యువతలో చైతన్యం నింపుతూ, డ్రగ్స్ ప్రమాదాలపై స్పష్టమైన అవగాహన సృష్టిస్తున్నాయి” అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రమాణ స్వీకారం చేయించి, మాదకద్రవ్యాల దూరం అవసరాన్ని వివరించారు. అనంతరం ర్యాలీ బుచ్చయ్యపేట మండలం వైపు రావికమతం ద్వారా సాగింది.
*వడ్డాది జంక్షన్ వద్ద పోలీసు సిబ్బందికి డీఐజి ప్రోత్సాహం*
మధ్యాహ్నం బుచ్చయ్యపేట మండలం, వడ్డాది జంక్షన్ వద్ద సైకిల్ ర్యాలీలో పాల్గొంటున్న పోలీస్ సిబ్బందిని
విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ స్వయంగా అభినందించి, వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వడ్డాది జంక్షన్ నుండి విజయరామరాజుపేట బ్రిడ్జి వరకు డీఐజీ స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొని యువతకు ఉదాహరణగా నిలిచారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.
*చోడవరం మండలానికి ర్యాలీ చేరిక*
సాయంత్రం సైకిల్ ర్యాలీ చోడవరం మండలం & గ్రామ జూనియర్ కాలేజీ వద్ద భారీగా చేరుకుంది.
ఈ కార్యక్రమంలో కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, సర్కిల్ ఎస్సైలు ఎం.శ్రీనివాసరావు, ఎం.రఘువర్మ, ఎ.శ్రీనివాసరావు, పి.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
*డీఐజీ గోపీనాథ్ జట్టి సందేశం*
“యువతే శక్తి – అభివృద్ధి దిశగా అడుగు | మాదకద్రవ్యాలకు ‘నో’ అనేదే నిజమైన విజయం”
“డ్రగ్స్ దూరం… అభివృద్ధి వైపు ప్రయాణం!”
దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని, మీ శక్తి, ప్రతిభ, ఆత్మవిశ్వాసమే అభ్యుదయ భారతానికి బలమైన శక్తి అని డీఐజీ గారు పేర్కొన్నారు.
మాదకద్రవ్యాలు యువతను నిశ్శబ్దంగా ఖాళీ చేసే శత్రువులని హెచ్చరించారు.
ప్రస్తుతం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న “అభ్యుదయం సైకిల్ యాత్ర” లక్ష్యం—
యువతను మాదకద్రవ్యాల ప్రమాదాల నుండి దూరంగా ఉంచడం
ఆరోగ్యవంతమైన, పురోగామి భవిష్యత్తు వైపు నడిపించడం
యువత శారీరక, మానసిక ఆరోగ్యాలు, కుటుంబాలు, సమాజంపై మాదకద్రవ్యాలు చూపే తీవ్ర ప్రభావాన్ని డీఐజీ గారు వివరించారు.
*యువతకు సూచనలు:*
మాదకద్రవ్యాలకు ఏ పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వకండి — అడ్డుకట్ట వేయండి.
తప్పుదారిలో ఉన్న స్నేహితులను సరైన మార్గం వైపు నడిపించండి.
అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి బాధ్యతగా నిలవండి.
నైపుణ్య శిక్షణలు, విద్యా అవకాశాలు, క్రీడలు, స్టార్టప్ కార్యక్రమాలు వంటి ఎన్నో అవకాశాలు మీ ఎదుగుదలకు సిద్ధంగా ఉన్నాయని గుర్తుంచుకోండి.
పోలీస్ శాఖ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠినమైన చర్యలు తీసుకుంటూ, యువత శ్రేయస్సుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇస్తోంది.
*డీఐజీ సందేశం ముగింపు:* *“డ్రగ్స్‌కు ‘NO’ అనండి — మీ భవిష్యత్తుకు ‘YES’ అనండి!

