హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చేతులమీదుగా ప్రారంభం.
మాదకద్రవ్యాల రహిత భవిష్యత్తు వైపు పెడలింగ్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి (పాయకరావుపేట), నవంబర్ :12
మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాలలో “అభ్యుదయ సైకిల్ ర్యాలీ” ప్రారంభమైంది. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, ఆలోచనలతో, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆధ్వర్యంలో సుమారు 30 రోజుల పాటు, 1,000 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్రగా కొనసాగుతుంది.
ర్యాలీని ఈ రోజు ఉదయం పాయకరావుపేటలోని గౌతమ్ థియేటర్ జంక్షన్ వద్ద గౌరవ హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ఘనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి గారు స్వయంగా సైకిల్ తొక్కి ర్యాలీని శ్రీప్రకాశ్ కాలేజ్ వరకు నడిపారు. విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించి, “మాదకద్రవ్యాలు వద్దు – జీవితమే ముద్దు” అంటూ ఆకట్టుకున్నారు.
ర్యాలీ ప్రారంభానికి విద్యార్థుల ఫ్లాష్‌మాబ్ ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రజలు, విద్యార్థులు అడుగడుగునా ర్యాలీకి హర్షధ్వానాలు చేశారు.
*హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ –*
“మాదకద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయం. యువతే మన భవిష్యత్తు – వారి జీవితాలను మత్తు పదార్థాలు చెడగొట్టకుండా కాపాడటం మనందరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలనలో ఉక్కుపాదం మోపింది.
ఈ దిశగా ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలి. గంజాయి రవాణా చేసినా, సేవించినా వెంటనే 1972 నంబర్‌కి కాల్ చేయండి – పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారు.
ప్రస్తుతం కఠినమైన NDPS చట్టాలు అమల్లో ఉన్నాయి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. డ్రగ్స్‌కు నో, జీవితానికి యెస్ చెప్పుదాం” అని ఆమె పిలుపునిచ్చారు.
విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ మాట్లాడుతూ
అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాయకరావుపేట నియోజకవర్గం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం విశాఖపట్నం రేంజ్ పరిధిలో సుమారు 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రలో ఐదు జిల్లాలకు చెందిన 25 మంది బృందంతో కూడిన పోలీస్ సిబ్బంది వెళ్తున్న మార్గంలో స్కూల్స్, కాలేజీలు మరియు గ్రామాలు,ముఖ్య కూడళ్ల వద్ద ప్రజలకు మాదక ద్రవ్యాలు అక్రమ వినియోగం పట్ల అవగాహన, చైతన్యం కల్పించడం జరుగుతుంది. డిఐజి రేంజ్ ఫరిదిలో అన్ని జిల్లాల ఎస్పీలతో సంప్రదించి ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ వారి వారి ప్రాంతాల్లో ర్యాలీ జరిగినప్పుడు ఆ జిల్లాల ఎస్పీలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిఐజి ఆదేశించారు.
“ఈ ‘అభ్యుదయ సైకిల్ ర్యాలీ’ మాదకద్రవ్యాల నిర్మూలనలో ఒక చారిత్రాత్మక అడుగు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి మార్గదర్శకత్వంలో గంజాయి నిర్మూలనలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.
గత 14 నెలల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పంటను పండించే రైతులకు అవగాహన కల్పించి, వారికి ప్రత్యామ్నాయ పంటల సాగు అవకాశాలు కల్పించాము. ఏఎస్ఆర్ జిల్లాలో 2024-2025 వ సంవత్సరం కి గాను 10,817.25 ఎకరాల్లో సుమారు 46.8 లక్షల మొక్కలను ప్రత్యామ్నాయ పంటలు పంపిణి చేయడం జరగగా, 2025-2026 వ సంవత్సరం కి గాను 196 మంది రైతులకు 210 ఎకరాలు లో 1,35,453 యూకలిప్టస్ మొక్కలు పంపిణీ చేయడం జరిగినది.
దీని ఫలితంగా, గంజాయి పంట సాగు 2021 -2022 వ సంవత్సరం కి గాను 7515 ఎకరాలలో సాగు చేయగా 2024-2025 వ సంవత్సరం కి గాను 93 ఎకరాలకు, 2025-2026 వ సంవత్సరం కి గాను ZERO సాగు (Cultivation) కు తీసుకురావడం జరిగినది. ఆ పంటను పూర్తిగా ధ్వంసం చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. డ్రోన్ లు, ఉపగ్రహ చిత్రాల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం వలన గంజాయి సాగు తగ్గిందని నిర్ధారించబడింది.
గత 14 నెలల్లో రేంజ్ పరిధిలో 865 కేసుల్లో 2,500 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 95 మందిపై PIT NDPS, 61 మందిపై PD యాక్ట్, 1,474 మంది పై సస్పెక్ట్ షీట్లు తెరవడం జరిగింది.
గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న వారిపై 14 ఆస్తి కేసులు నమోదు చేసి,13 మంది నిందితులపై రూ.10,04,89,621/- కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశాము.
2024-2025 సంవత్సరానికి గాను 53 NDPS కేసుల్లో 87 మందికి 10 నుండి 20 సంవత్సరాల కఠిన శిక్షలు విధించబడ్డాయి.
2024-2025 సంవత్సరానికి గాను 1109 కేసులు లో 60,369 కేజీ ల గంజాయి ని పట్టుకొని, 768 వాహణములను సీజ్ చేయడం జరిగినది.
ఇప్పటివరకు 18,314 “సంకల్పం” అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు – 10,41,325 మంది హాజరయ్యారు – 13,606 గ్రామాలు/పట్టణాలలో ఈ కార్యక్రమాలు జరిగాయి – 4,649 విద్యా సంస్థలు – సుమారు 4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
గంజాయి పిర్యాదులకోశం 3 88 డ్రాప్ బాక్సులు ను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.
ఈ చర్యలన్నీ యువత భవిష్యత్తు రక్షణ కోసమే. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ ర్యాలీ విజయవంతం కావడానికి సహకరిస్తున్న విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.”
*జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మాట్లాడుతూ –*
“మాదకద్రవ్యాల సేవనాన్ని, అక్రమ రవాణాను అరికట్టే దిశగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విశాఖపట్నం రేంజ్ పరిధిలో ‘అభ్యుదయ సైకిల్ ర్యాలీ’ను ప్రారంభించాం.
ఈ ర్యాలీ సుమారు 30 రోజుల పాటు 800 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. ర్యాలీ సందర్భంగా ప్రతి మండలంలో అవగాహన సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులతో చర్చలు జరిపి మత్తు పదార్థాల దుష్ప్రభావాలను వివరించనున్నాం.
గత ఏడాది కాలంలో అనకాపల్లి జిల్లా పరిధిలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పటివరకు 3,500కి పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.
మత్తు పదార్థాల గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా 112కి కాల్ చేయాలని ప్రజలను, యువతను కోరుతున్నాను. ఈ ర్యాలీకి అండగా నిలిచిన హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత , రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి , ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరికీ నా కృతజ్ఞతలు.”
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్ రావు, సబ్ డివిజన్ డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు , పాయకరావుపేట ఇన్స్పెక్టర్ అప్పన్న, ఎక్సైజ్ మరియు ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
