జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముమ్మరంగా తనిఖీలు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు
ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా ఉన్న కోస్టల్ ప్రాంతంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ల సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న కోస్టల్ కారిడార్ ప్రాంతంలో ఒంగోల్ వన్ టౌన్ సిఐ వై నాగరాజు తనిఖీలు ముమ్మరం చేస్తున్న పోలీసు సిబ్బంది.
కొత్త వ్యక్తులు కనిపిస్తే.వేంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని చేపలు వేటకు వెళ్ళే మత్యుకారులను ఆదేశించారు.
అదేవిధంగా కోస్టల్ ప్రాంతంలో వేటకు వెళ్ళినప్పుడు.. కొత్త ఎమైన బోట్లు కనిపిస్తే వేంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలన్నారు.
దేశంలో అరాచక శక్తులు.. విధ్వంసం సృష్టించి దేశ ఐక్యతను దెబ్బతిసే విధంగా వ్యవహరిస్తున్నారని అలాంటి వారిని దేశం నుండి తరిమికొట్టాలని మత్యకారులకు పోలీసు సిబ్బందికి ఆదేశించారు.
ప్రధాన దేవాలయాలు,భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ప్రత్యేక పర్యవేక్షణ.
ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులు, పార్సిల్ కార్యాలయాలు, షాపులతో సహా ప్రతి ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు.
రైల్వే స్టేషన్‌లు,ప్లాట్‌ఫారాలు, పరిసర ప్రాంతాలను బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి.
జిల్లాలోకి వస్తున్న ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేశారు.
షాపింగ్ కాంప్లెక్స్‌లు మాల్స్, పార్కింగ్ ప్రదేశాలతో సహా రద్దీగా ఉండే ప్రాంతాలలో తనిఖీలు.
అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల కదలికపై నిఘా.
ఈ తనిఖీల్లో బాంబుస్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పాటు ఏఆర్ సిబ్బంది మరియు సివిల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
అనుమానస్పద వాహనాలు, వదిలివేయబడిన వాహనాలను మరియు అనుమానస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.
జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు.
ప్రజలు ఏవైనా అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు గమనించినప్పుడు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అలాగే భయపడకుండా పోలీసులు చేపడుతున్న భద్రతా చర్యలకు సహకరించాలని జిల్లా ఎస్పీ , ప్రజలకు విజ్ఞప్తి చేశారు...
