భాగ్యనగరంలో భారీ వర్షం... అత్యధికంగా ఉప్పల్లో వర్షపాతం నమోదు.
క్రైమ్ 9 మీడియా బి రవికుమార్. తెలంగాణ ప్రతినిధి.
నవంబర్ .4. హైదరాబాద్ వ్యాప్తంగా భాగ్యనగరంలో భారీ వర్షం పడింది. మోస్తారు వర్షం తో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం వాహనదారులకు వర్షం అడ్డంకుగా మారి ట్రాఫిక్ తో ఇబ్బంది పడ్డారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్ తార్నాక ఉప్పల్, ఘట్కేసర్ నారాపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది ఉప్పల్ నారాపల్లి వరంగల్ రహదారిలో నీరు నిలిచిపోవడం వలన వ వాహనదారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైవే నిర్మాణం ఇప్పటివరకు జరగక రోడ్లన్నీ గుంతలు గుంతలు మయంగా మారడం వలన నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు గురవుతున్న జి.హెచ్.ఎం.సి అధికారులు మరియు ఆర్ .అండ్. బి అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వర్షం పడితే వరంగల్ హైవే రహదారి చెరువుల తలపిస్తుందని స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మరమ్మత్తుకే రోడ్ల నిర్మాణం సరిగ్గా లేక గుంతలు పడిన రోడ్ల వల్ల వాహనాలు పాడైపోతున్న పరిస్థితి ఉందని వాపోతున్నారు. చినుకు పడితే చిత్తడే అనే రకంగా ఉప్పల్ నారా పెళ్లి హైవే రహదారి పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తంతుగా కొనసాగుతుంది పట్టించుకునే నాధుడే లేడు అని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి రహదారి నిర్మాణం చేపట్టి రోడ్ల గుంతలు పూడ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
