పంట కొనుగోలు, మద్దతు ధర, పంట నష్టపరిహారం కొరకై ఏ.డి.ఏ. కార్యాలయముకు తరలి రండి.


 పంట కొనుగోలు, మద్దతు ధర, పంట నష్టపరిహారం కొరకై ఏ.డి.ఏ. కార్యాలయముకు తరలి రండి.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. నంద్యాల జిల్లా.

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నంద్యాల జిల్లా కమిటీ అధ్యక్షుడు ఏ. రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన నంద్యాల లోని సిపిఎం కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి. రామ చంద్రుడు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో కురిసిన అధిక వర్షాలకు తోడు మెంతు తుఫాన్ కావటం వల్ల జిల్లాలోని మొక్కజొన్న, వరి, మినుము, మిరప, బొప్పాయి, మునగ, ఉల్లి, పప్పు శనగ పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నష్టపరిహారం అంచనాలు వేయడం తప్ప ఎంత డబ్బులు నష్టపరిహారంగా ఇస్తామనేది స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించడం లేదని, చాలా గ్రామాల్లో అధికారులు ఏనుమరేష న్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాగే అరకొర మిగిలి ఉన్న మొక్కజొన్న పంటలను అమ్ముకోవడానికి ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నందువల్ల మధ్య దళారులకు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. అందువల్ల జిల్లాలోని రైతులందరీ అభివృద్ధినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులు కౌలు రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలనీ, మండల కేంద్రాల్లో తక్షణమే ప్రభుత్వకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరలకు మొక్కజొన్నతో పాటు, అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం కోసం జిల్లాలోని వ్యవసాయ కార్యాలయా లు నవంబర్ 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఆత్మకూరు ఏ. డి.ఏ కార్యాలయం, 12వ తేదీ ఆళ్లగడ్డ , నందికొట్కూరుఏడిఏ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయబోతున్నామని, రాజకీయాలకతీతంగా రైతాంగం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నంద్యాల జిల్లా విజ్ఞప్తి చేశారు. ఇది సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాటలతో కాలయాపన చేయడం మానుకొని, తక్షణం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వం పంటల బీమా ప్రీమియం చెల్లించడం వల్ల రైతాంగానికి పంటల బీమా దక్కేదని, ప్రస్తుత రాష్ట్ర కూటమి ప్రభుత్వం రైతులు ప్రీమియం చెల్లించాలని నిబంధన పెట్టడం తో జిల్లాలోని రైతాంగానికి పంటల బీమా అందకుండా పోతుందన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ ఆధారంగా పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులందరికీ పంట నష్టం, పంటల బీమా వెంటనే ఇవ్వాలని, కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని, జిల్లాలో దేవాలయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులందరికీ నష్టపరిహారం తో పాటు ప్రభుత్వ పథకాలన్నీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి .సుబ్బారాయుడు, టి వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి ఏ .సురేష్, రామ్మోహన్, వీరన్న లతోపాటు జిల్లాలోని వివిధ మండలాల నుండి జిల్లా కమిటీ సభ్యులు హాజరైనారు.

Post a Comment

Previous Post Next Post