జంగం గుంట్ల గ్రామం లో పొలంబడి.
క్రైమ్కం 9 మీడియా ప్రతినిధి.
కంభం సబ్ డివిజన్ ఇంచార్జి. గాలయ్య.
ప్రకాశం జిల్లా కంభం మండలంలోని జంగం గుంట్ల గ్రామం లో సెనగ పంటలో విత్తన శుద్ధి ఎరువుల యాజమాన్యంపై పొలంబడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.శనగ పంటలో విత్తనశుద్ధి ఎరువుల యాజమాన్యం గురించి మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ ముహమ్మద్ వివరించారు.
శనగ విత్తనములు ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు కేజీ విత్తనం చొప్పున పట్టించి విత్తన శుద్ధి చేయడం వలన భూమి మరియు విత్తనాలు ద్వారా వ్యాపించి తెగుళ్లను అరికట్టవచ్చని , అలాగే సెనగ పంటకు వేయవలసిన ఎరువుల గురించి వివరంగా రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.హెచ్.ఏ.లక్ష్మి రైతులు పాల్గొన్నారు.
