ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు.. భక్తుల రద్దీతో ఆలయాలు.
క్రైమ్ 9మీడియా.. మంచిర్యాల జిల్లా ప్రతినిధి ..రాకేష్ కుమార్..
నవంబర్ 5...... మంచిర్యాల జిల్లా "తెలంగాణ అన్నవరం"గా ప్రసిద్ధిగాంచిన గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి పారవశంగా ప్రత్యేక పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో గోదావరి నది తీరంలో పవిత్ర స్నానాలు ఆచరించి సత్యనారాయణ స్వామి ఆలయాన్ని చేరుకొని స్వామి వ్రతాలు, దీపారాధనలు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, నోములు వైభవంగా నిర్వహించారు. విద్యుదీకరణతో ఆలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించడం తో పాటు కాంతుల హరివిల్లు వలె ప్రకాశింపజేసి ఆలయాన్ని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తులసి పూజలు, దీపారాధనలు, తీర్థ ప్రసాద వితరణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు ,తాత్కాలిక పార్కింగ్ వసతులు ఆలయ కమిటీ కల్పించారు. సమీపంలో అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి మరియు సాయిబాబా ఆలయాలు ఉండడంవల్ల భక్తితో భక్తులు మరింతగా రద్దీతో పూజలు భక్తి తో పూజలు చేశారు. ప్రతి పౌర్ణమి కార్తీకమాసంలో ఇక్కడ జరిగే వేడుకలు విశేషాలు నిలుస్తాయని భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో భద్రత ఏర్పాట్లను కట్టుదిద్ధం చేశారు. గోదావరి నదిలో హెచ్చరికలు జారీచేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మహిళ కోసం ప్రత్యేకమైన షెడ్డు ఏర్పాటు చేసి ఆలయ అధికారులు, అర్చకులు సిబ్బంది సమన్వయంతో భక్తులకు సేవలు అందించారు. గూడెం గుట్ట ప్రాంతమంతా భక్తి ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయి కార్తీక పౌర్ణమి దీపోత్సవం దివ్యకాంతులతో సత్యనారాయణ స్వామి స్వామి దేవాలయం నిండు కాంతులు హరివిల్లుతో విరాజిల్లింది.

