క్రైమ్ 9 మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ యొక్క ఆదేశాలపై ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ యు రవిచంద్ర శక్తి టీం సభ్యులు శక్తి యాప్ యొక్క ఉపయోగాలను గురించి సదస్సు ను శ్రీ ఆదిత్య కాలేజీ విద్యార్థుల కు అవగాహన నిర్వహించినారు.
శక్తి యాప్ (SHAKTI App) ఒక మహిళా భద్రతకు సంబంధించిన అత్యవసర స్పందన (Emergency Response) మొబైల్ అప్లికేషన్. దీనిని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అభివృద్ధి చేసింది. ఇది ముఖ్యంగా మహిళలు మరియు బాలికలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు రూపొందించబడింది అని, ఏది అయినా అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ను ఉపయోగించిన ఎడల లేదా డయల్ 112 కు సమాచారం అందించిన ఎడల.
దీని ద్వారా సమీప శక్తి టీం గస్తీ బృందం తక్షణమే మీ వద్దకు చేరుకోగలదు.
మహిళా రక్షణపై నమ్మకమైన సాధనం ఈ యాప్ ద్వారా మహిళలు రాత్రి పూట లేదా ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు భద్రత గా భావించవచ్చు.అవగాహన మరియు శక్తి యాప్ లో మహిళల హక్కులు, చట్టాలు, పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ లు మొదలైన సమాచారం లభిస్తుంది.
సైబర్ నేరాలు, హరాస్మెంట్ వంటి వాటి గురించి కూడా అవగాహన పొందవచ్చు.
హెల్ప్ లైన్ నెంబర్ లను అందుబాటులో ఉన్నట్లు
112 – ఎమర్జెన్సీ నెంబర్ 181 – మహిళా హెల్ప్ లైన్ వంటి నెంబర్లను నేరుగా యాప్ నుండి కాల్ చేయవచ్చు.
ఫ్రెండ్ ట్రాకింగ్ / సేఫ్టీ షేరింగ్. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో లైవ్ లొకేషన్ ను పంచుకోవచ్చు వారు మీ ప్రయాణాన్ని గమనించవచ్చు.
శక్తి యాప్ ను ఉపయోగించ వలసిన సందర్భాలు వేధింపులు, (Harassment)
కిడ్నాప్ ప్రయత్నం,గృహ హింస,రహదారిలో ఒంటరిగా ప్రయాణం, అనుమానాస్పద వ్యక్తుల ప్రవర్తన శక్తి యాప్ ఒక ఆత్మ విశ్వాసానికి కలిగి ఉంటాడడానికి నిదర్శనం, మహిళలు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండేందుకు పోలీస్ శాఖ తీసుకున్న అద్భుతమైన చర్య. ప్రతి మహిళా తమ ఫోన్ లో ఈ యాప్ తప్పనిసరిగా ఉంచుకోవాలి అని ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ విద్యార్థులకు తెలియ చేసినారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి ఏలూరు 1 టౌన్ ఎస్ఐ దుర్గా ప్రసాద్ , శక్తి టీం సభ్యులు ఆదిత్య కాలేజీ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
