ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాను పట్టుకున్న చోడవరం పోలీస్.


 ప్రాణాలకు తెగించి గంజాయి ముఠాను పట్టుకున్న చోడవరం పోలీస్.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:23.

చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గంజాయి కార్ చేసిన బీభత్యం

నేపథ్యంలో శనివారం చోడవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో అనకాపల్లి డిఎస్పి ఎం. శ్రావణి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గంజాయి అక్రమ రవాణాపై విశ్వసనీయమైన ముందస్తు సమాచారం రావడంతో, చోడవరం ఎస్ఐ నాగ కార్తీక్ తమ పై అధికారులకు తెలియజేసి, వారి ఆదేశాల మేరకు మధ్యవర్తులు, సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు.

శుక్రవారం సుమారు 04-00 పీఎం గంటల సమయంలో చోడవరం మండలం, హోండా షోరూమ్ వద్ద పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, వడ్డాది వైపు నుండి బోల్డ్ బేజ్ M. రంగు గల హోండా సిటీ కారు సాధారణ పోవులును గుద్దుకుంటూ మరియు పోలీస్ వారిని చంపి తప్పించు కోవాలి అనే ఉద్దేశంతో రాజస్తాన్ కి చెందినా ఇద్దరు యువకులు 240 కిలోగ్రాముల గంజాయిని చోడవరం మీదగా రాజస్తాన్ తీసుకుపోవుటకు చోడవరం చేరుకొని భీబత్సం సృష్టించినారు ఇద్దరు సాధారణ పౌరులును గుడ్డించి వెంకన్నపాలెం వైపు నుండి పెద్ద వాహనాలు రావడం, ముందుగా ట్రాన్స్ ఫార్మర్ కలిగిన విద్యుత్ స్థంభం ఉండడం చేత, ఆ కార్ విద్యుత్ స్థంభానికి ఢీకొని ఆగింది. చోడవరం పోలీస్ సిబ్బందితో కలిసి వెంటాడి కొద్దిపాటి దూరంలో వారిని పట్టుకున్నారు.ఈ అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వారు రాజస్థాన్కు చెందిన వారీగా గుర్తించారు. వారి వద్ద మొత్తం 8 గోనీ సంచులలో కలిపి 240 కిలోల గంజాయి ఉన్నటు తద్వారా ఎస్సై మధ్యవర్తుల సమక్షంలో మొత్తం 240 కిలోల గంజాయి (8 తెల్లని ప్లాస్టిక్ గోనె సంచుల్లో)

హోండాసిటీ కారు - ఒరిజినల్ రిజిస్ట్రేషన్ నెంబర్: RJOGCB5110, 

A5 వద్ద ఉన్న Realme కంపెనీ ఆండ్రాయిడ్ ఫోన్ మొబైల్ నెంబర్:

కారుకు ముందు-వెనుక అమర్చిన తప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు - AP31BA9022 (2 సంఖ్యలు)ను కేసు దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకొని నిందుతులును అదుపులో తీసికున్నారు.అంతేకాకుండా పోలీసుల ప్రాణాలకు పొంచిన ముప్పు కారణంగా హత్యా ప్రయత్నం కింద సెక్షన్. NDPS act l కేసు రిజిస్టర్ చేసి పై ఇద్దరు నిందితులను 21.11.2025న సాయంత్రం 18-00 గంటలకు సంఘటనా స్థలంలో అరెస్ట్ చేసి, చట్టపరమైన మరిన్ని చర్యల కోసం కోర్టుకు హాజరుపరచబడుచున్నారు. మిగిలిన ముఠా సభ్యులై ఆసిఫ్, రాజేష్, రమేష్ పట్టుబడుటకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.

ఫై ఇద్దరి ముద్దాయిలు ఫై సదరన పౌరులు అయ్యిన భాదితులు గాయపడిన వారి నుండి పిర్యాదు స్వీకరించా వారి పై క్రైమ్ నెంబర్ 268/25 u/s 125 (B) bns కింద కేసు నమోదు చెయ్యడం జరిగింది.

గాయపడినవారు: కుర్మదాసు గోవింద్, కుర్మదాసు చిన్నమ్మలు దుడ్డు పాలెం గ్రామం.

Post a Comment

Previous Post Next Post