మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి.


 మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం,

రాజకీయాలకతీతంగా అర్హులైన మహిళలందరికీ సంక్షేమ పథకాలు

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి,ప్రకాశం జిల్లా కొండపిలో డ్వాక్రా మహిళలకు మెగా రుణమేళా యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి డా.స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య,

ప్రకాశం జిల్లా కొండపిమండలం

మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా కొండపిలో డి ఆర్ డి ఏ. వెలుగు ఆధ్వర్యంలో మహిళలకు మెగా రుణమేళా యూనిట్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి డా.స్వామి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండపి, జరుగుమల్లి, మర్రిపూడి మండలాలకు చెందిన మహిళలకు రూ. 24 కోట్ల 15 లక్షల విలువైన చెక్కులు, రుణ యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి మాట్లాడుతూ....మహిళల ఆర్థిక స్వావలంబనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. డ్వాక్రా మహిళలకు రుణాలు, స్వయం ఉపాధి కల్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. జిల్లాలో డ్వాక్రా మహిళల సొమ్ము దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాం. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం.మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు, రుణాలు, సంక్షేమ పథకాలు అందిస్తోంది. ఎస్సి కార్పోరేషన్ ద్వారా సబ్సిడికి మహిళలకు ఈ ఆటోలు ఇచ్చాం. మహిళల కోసం దీపం, స్త్రీ శక్తి, తల్లికి వందనం వంటి సూపర్ సిక్స్ అన్ని హామీలు అమలు చేస్తున్నాం. రాజకీయాలకతీతంగా అర్హులైన మహిళలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు మండల కూటమి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post