దేవరపల్లి గ్రామ శివారులో పేకాట శిబిరం పై దాడి ముగ్గురు పేకాట రాయల అరెస్టు, నగదు స్వాధీనం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, చీమకూర్తి సీ ఐ డి. ప్రసాద్ పర్యవేక్షణలో చీమకూర్తి పోలీస్ సిబ్బంది ప్రత్యేక దాడి నిర్వహించారు.
చీమకుర్తి మండలం దేవరపల్లి గ్రామ శివారు ప్రాంతంలోని పొలాల్లో అక్రమంగా జరుగుతున్న జూదాటపై ఖచ్చితమైన సమాచారం అందడంతో, పోలీసులు వెంటనే స్పందించి అక్కడ దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు జూదగాళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి ₹18,620/- నగదును స్వాధీనం చేసుకున్నారు.
జూదం ప్రజలకు ఆర్థిక, సామాజిక నష్టాలను కలిగించే తీవ్రమైన నేరం.ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు నిరంతర చర్యలు కొనసాగుతాయన్నారు.
గ్రామాల్లో శాంతి-భద్రతల కోసం పోలీసులు ఎల్లప్పుడూ పర్యవేక్షణలో పనిచేస్తున్నాo.
అక్రమ జూద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Add

