లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన కల్పించాలి. జిల్లా వైద్య అధికారి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు – ప్రకాశం భవన్ – జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అయిన డా.టి.వెంకటేశ్వర్లు, అద్యక్షతన గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పై జిల్లా స్తాయీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేసము నందు కమిటీ సబ్యులు అయినటువంటి డా.యం.సంద్యారాణి, హెచ్ ఓ డి.. గైనికాలజిస్ట్, డా.ఎ.తిరుపతిరెడ్డి, హెచ్.ఓ.డి., చిన్న పిల్లల వైద్యనిపుణుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, డి.పి.ఆర్.ఓ. టి.మొహన్ రాజు, ఐద్వా సెక్రటరీ కే.రమాదేవి, జిల్లా ఆరోగ్య విస్తరణ మరియు మీడియా అధికారి బెల్లం నరసింహ రావు మరియు డిప్యూటి.డెమో.సరోజినీ పాల్గొనటం జరిగినది.
ఈ సమావేశములో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా.టి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. ప్రకాశం జిల్లాలోని మూడు డివిజన్లలోగల అన్ని స్కానింగ్ కేంధ్రాలను తనికీ చేసి స్కానింగ్ చేసే వైద్యులు, విద్యా అర్హతలు.సెంటర్ పత్రాలు పరిశీలించాలని తెలియజేసారు.
స్కానింగ్ కేంద్రములో లింగ నిర్ధారణ చట్ట రీత్యా నేరం అని చేసినచో మూడు సవత్సరాల కటిన కారాగార శిక్ష, యాభైవేల రూపాయల జరిమానా మరియు తదుపరి ఉల్లంగనకు పాల్పడితే ఐదు సoవత్సరాల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధించ బడుతుందని, లింగ నిర్ధారణ పరీక్ష చేసిన వారు, చేయించుకున్న వారు. మరియు ప్రోత్స హించిన వారుకూడా శిక్షార్హులు అని తెలియజేసారు.
ప్రతి స్కానింగ్ సెంటర్ కు వచ్చే గర్భిణి స్త్రీల వివరాలు ఎఫ్.ఫారం లో ఆన్ లైన్ లో నమోదు చేయాలనీ తెలిపారు.
సమాజములో స్త్రీ పురుషుల నిష్పత్తి సమానముగా చూసే భాద్యత ప్రబుత్వ మరియు ప్రైవేటు వైద్యులపై ఉందన్నారు.
ప్రస్తుతం జిల్లలో 186 స్కానింగ్ సెంటర్లు పని చేస్తున్నాయి అని అవి తల్లి గర్భములో శిశువు యొక్క ఆరోగ్య పరిస్టితి తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని లింగ నిర్ధారణ చేయకూడదని తెలిపారు. జిల్లాలో టంగుటూరు, మర్రిపూడి, రాచర్ల, చంద్రశేఖరాపురం.లాంటి మండలాలలో స్త్రీ నిష్పత్తి తక్కువగా ఉనందువల్ల మండలములోని వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బంది, ఆరోగ్య కార్య కర్తలు, ఆశా కార్యకర్తలు విరివిగా సమావేశాలు నిర్వహించి లింగ నిర్ధారణ చట్టము పై అవగాహనా కల్పించాలని తెలిపారు.
ఇన్స్పెక్షన్ చేసే అధికారులు డెకాయ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయాలనీ, ఆరోగ్య సిబ్బంది ఉమన్ & చైల్డ్ వెల్ఫేర్, విద్యాశాఖ. పంచాయతీరాజ్ శాఖ మరియు తదితర శాఖల సహాయ సహకారాలు తీసుకొని బాలికల యొక్క నిష్పత్తిని పెంచాలని తెలిపారు.
Add


