ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని వెలగలపాయ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ ఎరువులు మరియు పురుగు మందుల షాపు పై మండల వ్యవసాయ అధికారి మరియు (క్వాలిటీ కంట్రోల్ ) వారు ఆకస్మిక దాడులు నిర్వహించారు నిల్వల రిజిస్టరు, బిల్ పుస్తకాలు, ఇన్వాయిసులు మరియు లైసెన్సులను పరిశీలించడం జరిగింది, అనధికారిక అక్రమ ఎరువులను గుర్తించారు. షాప్ యజమాని కారే శ్రీనివాసుల పై 6(a) కేసు నమోదు చేసమని తెలిపారు. ఎరువుల మొత్తం విలువ 54,267 రూపాయల ఉంటుందని తెలిపారు ఎరువులు పురుగు మందులు కొన్నటువంటి రైతులకు తప్పనిసరిగా బిల్లు లు ఇవ్వలని డీలర్లకు తెలియజేశారు, ఎవరైనా అధిక ధరలకు అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయో మందులకు తప్పనిసరిగా G1, G2 మరియు G3 పర్మిషన్ ఉన్నవి మాత్రమే అమ్మలని డీలర్లకు తెలియజేశారు.
