బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయనని కలిసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీను.
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వ పథకాల అములును గురించి ఇరువురు చర్చించుకున్నారు.
బొబ్బిలి నియోజకవర్గ నాయకులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావుకి బేబీనాయన పరిచయం చేశారు. అనంతరం, మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ తో బొలిశెట్టి శ్రీనివాసరావు మాట్లాడి, బొబ్బిలి పట్టణంలో వారు చేపడుతున్న కార్యక్రమాలను గురించి అడిగి తెలుసుకుని, మరింత అభివృద్ధి చెయ్యాలని కొన్ని సలహాలను సూచించారు.
