నా ఇల్లు,నా గ్రామం,నా రాష్ట్రం, నాదేశం పరిశుభ్రతగా ఉంచి సంపూర్ణ ఆరోగ్య గ్రామంగా ఉంచడమే నా ధ్యేయం.- సర్పంచ్ బూరె బాబురావు.
అనకాపల్లి నవంబర్:15
దేవరాపల్లి మండలం బోయిలకింతాడ గ్రామం లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి నెల,మూడువ శనివారం ప్రత్యేక పారిశుధ్యంగా పరిశుభ్రత తో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంతో పాటు పల్లెలు అన్ని పరిశుభ్రంగా ఉండాలి అని తద్వారా ప్రజలు అందరూ మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు అని అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యంగా ఆయొక్క కుటుంబాలు జీవన ప్రమాణాలుతో మెరుగు పడతాయిఅని అటువంటి ప్రామాణాలుతో గ్రామంలో ప్రతి ఇల్లు,ప్రతి కుటుంబం ముందుకువచ్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తడిచెత్తను, పొడి చెత్తను వేరు చేసి ప్లాస్టిక్ ని నిషేధం చేస్తూ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు (హరిత రాయబారులు)కు మీ యొక్క సహకారం అందించి మన ఇల్లు, మన కుటుంబంతో పాటు,మన వీధి,మన గ్రామాన్ని స్వచ్చందంగా తీర్చిదిద్దుకోవాలి అని తద్వారా సమాజానికి మంచి సంకేతం ఇవ్వాలి అని అందులో మన గ్రామం ముందు ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ గాతీర్చిదిద్దాలి అని స్వచ్చ ప్రతిజ్ఞ చేసి గ్రామ ప్రజలుకు అవగహన ద్వారా తెలియజేసి ప్రజలు అందరూ సహకరించాలీ అని గ్రామ ప్రజలును కోరడమైనది *అలాగే గ్రామం లో ప్రజలు వద్ద నుండి పాడుబడిన ఎలక్ట్రానిక్,ప్లాస్టిక్ వ్యర్ధాలు సేకరించి SWPC షెడ్డు వద్దకు తరలించడం జరిగింది అలాగే గ్రామంలో పాటు ఎంపీపీ పాఠశాలలో దోమలు అరికట్టాలి అని ఎటువంటి విష జ్వరాలు గాని, అనారోగ్యం లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్ బూరె బాబురావు గ్రామ పంచాయతీ కార్యదర్శి కిల్లో అర్జున్.గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామ పెద్దలు,గ్రామ సచివాలయం సిబ్బంది,గ్రామ స్వచ్ఛత సేవా సిబ్బంది,ఆరోగ్య సిబ్బంది,వెలుగు సిబ్బంది,స్వయం సహాయక సంఘాలు సభ్యులు,గ్రామ పెద్దలు,ప్రజలు అందరూ పాల్గొని గ్రామం లో ఉన్న అన్ని వీధుల్లో,ముఖ్యమైన కూడల్లో పరిశుభ్రత చేసి ప్రజలు అందరూ మన గ్రామాన్ని మనమే స్వచ్చందా గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
