“స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” (SASA) నవంబర్ 2025 నెల థీమ్: ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ – ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పోలీసుల శ్రమదానం.



 “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” (SASA) నవంబర్ 2025 నెల థీమ్: ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ – ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పోలీసుల శ్రమదానం.

అనకాపల్లి, నవంబర్ 15:

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నవంబర్ నెల Swarna Andhra – Swachh Andhra (SASA) కార్యక్రమం కోసం ప్రకటించిన అధికారిక థీమ్ “ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ” ను పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నాయకత్వంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో పేరుకుపోయిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పాత ఫైళ్ళ అవశేషాలు, పాడైపోయిన పరికరాలను శుభ్రపరిచారు. వాటి వల్ల కలిగే అనారోగ్య పరిస్థితులు, కార్యాలయ పనితీరుపై ప్రభావం తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఆఫీస్ గదులు, రికార్డు గదులు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, స్టోర్ రూం వంటి ప్రాంతాల్లో దాగి ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తొలగించి కార్యాలయాన్ని పూర్తిగా శుభ్రపరిచారు. చెత్త నిర్వహణ కోసం ప్రత్యేక డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయగా, భవిష్యత్తులో ఈ సమస్యలు రాకుండా వేస్ట్ మేనేజ్‌మెంట్ చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ లక్ష్మి మాట్లాడుతూ,ప్రతి కార్యాలయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ చాలా ముఖ్యమైనది. ఇవి అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉన్నందున, పోలీస్ శాఖ పరిశుభ్రత విషయంలో ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలవాలి” అని పేర్కొన్నారు.

ప్రమాదకర వ్యర్థాలను తొలగించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మొక్కలు నాటడం వంటి చర్యలు కూడా చేపట్టారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.లక్ష్మి తో పాటు ఎస్సైలు వెంకన్న, విశ్వనాథం, ఇతర అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post