కంభం లో ఆధునికాంధ్ర దినపత్రిక నూతన ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించిన ఏ సీ పి,




 కంభం లో ఆధునికాంధ్ర దినపత్రిక నూతన ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించిన ఏ సీ పి, 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు 

 ప్రకాశం జిల్లా కంభం లో వై జంక్షన్ సమీపమున. ఆధునికాంధ్ర దినపత్రిక ప్రాంతీయ కార్యాలయమును నీలకంఠం అధ్యక్షతన. వై సాగర్. స్వర్ణ. నారాయణ. ఆధ్వర్యంలో.ఈరోజు హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎం కిరణ్ కుమార్, మరియు కంభం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి నరసింహారావు,చేతులమీదుగా రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు,అలాగే , ఆధునిక ఆంధ్ర పత్రిక లోగోను. పత్రికను ఆవిష్కరించారు, 

ముందుగా ఏసీబీ గారికి ఘన స్వాగతం పలికి పూలమాలతో శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ. అధికారులకు ప్రజలకు వారధిగా నిలవాలని విమర్శలకు తావు లేకుండా ప్రజా సమస్యలు ఉన్నతాధికారులకు తెలియపరచడానికి ప్రతి ఒక్క జర్నలిస్టు ముందుకు రావాలని అలాగే మనకిచ్చిన రాజ్యాంగం చట్టాలను అనుసరించి ఒక్కొక్క అక్షరమును వార్తగా మలిచి ప్రజలకు అధికారులకు తెలియపరిచే వారే జర్నలిస్టులు అన్నారు. 

కంభం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి, నరసింహారావు మాట్లాడుతూ అవినీతి అక్రమాలను వెలికి తీసే వాళ్లే నిజమైన జర్నలిస్టులు అన్నారు, గిద్దలూరు నియోజకవర్గం లోని కంభం లో ఆధునికాంధ్ర ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేసిన పత్రిక మేనేజ్మెంట్ కు వారి బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు దాసరి యోబు, ది ఏ సి బి జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్, అధ్యక్షులు ఒంగోలు అల్లూరయ్య. ఉపాధ్యక్షులు అమృతరాజు. యూనియన్ సభ్యులు ఎస్ కే సలీం. ఎస్ డి. అసదుల్లా. డి బాబు. నాగయ్య. మైకేల్. రవి. వెంకటేష్. తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అనంతరం ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఆధునికాంధ్రా దిన పత్రిక తరుపున కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post