పదవీ విరమణ చేసిన హోంగార్డు కైసర్ల కృష్ణారావుకు ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.


 పదవీ విరమణ చేసిన హోంగార్డు కైసర్ల కృష్ణారావుకు ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

పి మహేశ్వరరావు.

అనకాపల్లి, నవంబర్ 19: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించి ఇటీవల పదవీ విరమణ పొందిన కైసర్ల కృష్ణారావుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆర్థిక సహాయం అందజేశారు.

ఉమ్మడి అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు స్వచ్ఛందంగా ఒక రోజు డ్యూటీ అలవెన్స్‌ను విరాళంగా అందించగా, ఆ నిధితో కూడిన *రూ.4,03,670/-* విలువైన చెక్కును జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో కైసర్ల కృష్ణారావుకి అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ కైసర్ల కృష్ణారావు సేవలను ప్రశంసిస్తూ, “విధి నిర్వహణలో ఆయన నిబద్ధత, నిజాయితీ, విశ్వసనీయత అత్యంత శ్లాఘనీయాలు” అని పేర్కొన్నారు. అలాగే హోంగార్డుల సంక్షేమం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహోద్యోగులకు ఆర్థిక సహాయం అందించే హోంగార్డుల స్ఫూర్తి అభినందనీయమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి సి.హెచ్.తిలక్ బాబు, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post