రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం.
రెండో విడత రైతులకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమం.
ఏలూరు క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, నవంబర్ 19:- రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా రెండో విడత నగదు జమ కార్యక్రమంలో భాగంగా ఏలూరు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 లోని రైతు సేవ కేంద్రంలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారిద్దరూ ముందుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఉపన్యాసాలు వీక్షించారు. అనంతరం రైతులతో ప్రత్యేకంగా ముచ్చటించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం చెక్కులను రైతులకు పంపిణీ చేశారు.
ఈసందర్భంగా బడేటి చంటి, రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని రైతుల కోసం వారి సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తుంది అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నారని, మొదటి విడత కేంద్రం ఇచ్చిన 2000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 5000 కలిపి ఆగస్టు 2వ తేదీన మొత్తం 46, 85, 838 రైతులకు లబ్ది చేకూరిందని అలాగే రెండో విడత కూడా నేడు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు అని అన్నారు. మొత్తం రెండు విడతల్లో కలిపి రాష్ట్రంలో ఉన్న దాదాపు 47 లక్షల మందికి 6, 309.44 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసారని అన్నారు. అలాగే దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటలల్లోనే రైతులకు నగదు చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడ చైర్మన్ పెద్ది బోయిన శివ ప్రసాద్, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ శ్రీమతి కావూరి వాణిశ్రీ, పలు కార్పోరేషన్ ల చైర్మన్లు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర అధ్యక్షులు వీరంకి పండు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జనసేన నాయకులు రెడ్డి గౌరీ శంకర్, బుధ్ధా నాగేశ్వరరావు, బోండా రాము నాయుడు, ఎట్రించి ధర్మేంద్ర, పైడి లక్ష్మణరావు, దోసపర్తి రాజు, దుర్గారావు, కోలా శివ, చిత్తిరి శివ, రాము, కూని శెట్టి మురళి కృష్ణ, గొడవర్తి నవీన్, మాజీ ఈడ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, వీర మహిళ తుమ్మపాల ఉమా దుర్గా, పలువురు కూటమి పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

