పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 2 వ విడత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:19
మాడుగుల మండల కేంద్రంలోని స్థానిక తులసి కల్యాణ మండపంలో పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ 2 వ విడత నిధులు విడుదల కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి పాల్గొనడం జరిగింది. మాడుగుల నియోజకవర్గంలోని 45,340 మంది లబ్ది దారులుగాను 29,70,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. అలాగే APCNF ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ సంక్షేమ మరియు అభివృద్ధి శాఖ చైర్మన్ పీవీజీ కుమార్ , ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది

