అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలి. జాయింట్ కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో ప్రజలు పుణ్యస్నానాలు ఆచరించేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. సముద్రస్నానాలకు వచ్చిన ప్రజలతోనూ ఆయన మాట్లాడారు. సంప్రదాయబద్ధంగా పుణ్యస్నానాలు ఆచరించాలని వారికి సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట మండల స్పెషల్ ఆఫీసర్ అయిన డిఆర్డిఏ పిడి నారాయణ, తహసిల్దార్ శాంతి, మెరైన్ పోలీసులు, ఇతర అధికారులు ఉన్నారు.
