జాగ్రత్తగా ఉండండి – అనుమానాస్పద కదలికలను వెంటనే పోలీసులకు తెలియజేయండి : జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.అనకాపల్లి, నవంబర్ :11
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన నేపథ్యంలో, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా జిల్లా వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేయాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అధికారులను ఆదేశించారు.విశాఖపట్నం ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని అన్ని పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ముఖ్యంగా విశాఖ దిశగా వెళ్తున్న వాహనాలను పరవాడ, సబ్బవరం చెక్‌పోస్టుల వద్ద పూర్తిగా తనిఖీ చేయాలని సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ప్రధాన కూడళ్లలో పోలీస్ సిబ్బంది స్పష్టంగా కనిపించే విధంగా తనిఖీలు జరపాలని ఎస్పి ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, స్థానిక పోలీసులు సమన్వయంతో సమాచార సేకరణను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేస్తూ -
“ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. మీ సహకారం ద్వారానే మన జిల్లా సురక్షితంగా ఉంటుంది,” అని అన్నారు.
.jpg)
