శ్రీ నగరేశ్వర స్వామి వారి కళ్యాణం– ఆర్యవైశ్య సంఘం పులివెందుల.



 శ్రీ నగరేశ్వర స్వామి వారి కళ్యాణం– ఆర్యవైశ్య సంఘం పులివెందుల.

10 నవంబర్, క్రైమ్ 9 మీడియా త్రిలోకేష్ పులివెందుల రిపోర్టర్.

       పులివెందుల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కార్తిక మాసం మూడవ సోమవారం పునస్కరించుకొని ఈరోజు అమ్మవారిశాలలో వెలసిన శ్రీ నగరేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం పరిసరాలు దీపాల కాంతులతో, పూలతో అలంకరించబడి భక్తిరసమయంగా మారాయి.

ఉదయం పూజలు, అభిషేకాలతో ప్రారంభమైన వేడుకలో పండితులు వేదమంత్రాల నడుమ శ్రీ నగరేశ్వర స్వామి వార్ల వివాహ కర్మలను ఘనంగా నిర్వహించారు. పల్లకీ సేవతో ఉత్సవ మూర్తులను ఊరేగించగా, భక్తులు “హరహర మహాదేవ” నినాదాలతో మారుమోగించారు.

సాయంత్రం మేళ తాళాల సాంస్కృతిక ప్రదర్శనాలతో శ్రీ నగరేశ్వర స్వామి వార్లు సతీ సమేతంగా గ్రామోత్సవం కళకళలాడింది. పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాద స్వీకరించబడినారు.

ఆర్యవైశ్య సంఘం వారు భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన స్వచ్ఛంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post