ఏపీ ఫారెస్ట్ అసోసియేషన్ ఎన్నికలు-అధ్యక్షుడుగా బీ రవినాయక్, ప్రధాన కార్యదర్శిగా సీ ఆనంద్.
తిరుపతి క్రైమ్ 9మీడియా ప్రతినిధి.
ఏపీ ఫారెస్ట్ అసోసియేషన్ తిరుపతి విభాగం ఎన్నికలు శనివారం కపీలతీర్థం సమీపంలోని ఫారెస్ట్ కార్యాలయం ఆవరణలో జరిగింది. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా బీ. రవి నాయక్, ప్రధాన కార్యదర్శిగా సీ ఆనంద్ ఎన్నికయ్యారు. ఇంకా అసోసియేట్ ప్రెసిడెంట్ గా టీ.గణేష్, కోశాధికారిగా ఆర్. భాగ్యరాజు, ఉపాధ్యక్షులుగా ఎం. సునీత, జాయింట్ సెక్రటరీగా ఎస్. శ్రీకాంత్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా రమాదేవి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీవో ప్రెసిడెంట్ సురేష్ బాబు ఆధ్వర్యంలో లోకబాద్ బాబు, రత్నం, తిరుమల బాబు ఎన్నికలు సజావుగా జరిగాయి.
