మూలగుంటపాడు గ్రామంలో స్వామిత్వ ప్రత్యేక గ్రామసభ.

మూలగుంటపాడు గ్రామంలో స్వామిత్వ ప్రత్యేక గ్రామసభ.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

స్వమిత్వ సర్వేతో గ్రామాలలోని భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి.

 ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామంలో ఏర్పాటుచేసిన స్వమిత్వ ప్రత్యేక గ్రామ సభలో మంత్రి . డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, మాల కార్పోరేషన్ చైర్మన్ డా. విజయకుమార్ లతో కలసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. రీ సర్వే చేసి గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను తగ్గించాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం స్వమిత్వ పధకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.  

మన రాష్ట్రంలో 5846 గ్రామాల్లో స్వమిత్వ కార్యక్రమం చేపట్టగా, ఇప్పటికి 4440 గ్రామాల్లో పూర్తీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం అమలులో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉండటం జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 

 సింగరాయకొండ మండలం లో 5 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తీ చేశారన్నారు. ఈ రీ సర్వే వలన గ్రామాలలోని భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. స్వమిత్వ సర్వే ద్వారా రెవిన్యూ సిబ్బంది తయారు చేసే రికార్డు శాశ్వతమైనదని, భవిష్యత్తు కాలంలో ఎలాంటి భూవివాదాలకు తావుండదని అన్నారు. 

ఈ సర్వే కార్యక్రమంలో భాగస్వాములు అయి సహకరించినందుకు గ్రామ ప్రజలకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ ని నెరవేరుస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంతో పనిచేస్తున్నదన్నారు. గత ప్రభుత్వ కాలంలో అన్నా క్యాంటిన్ లను మూసి వేయడం జరిగిందని, 

ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరిగి అన్నా క్యాంటిన్లను తెరిపించడం జరిగిందన్నారు. తల్లికి వందనం కార్యక్రమం క్రింద ఎంత మంది పిల్లలు చదువుకుంటుంటే అంత మందికి ఆర్ధిక సహాయం అందించడం జరుగుచున్నదన్నారు.  

మహిళలకు ఉచిత బసు సౌకర్యం, రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇప్పటికే 14 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని, మిగిలిన 6 వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ, పేదల సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని మంత్రి తెలిపారు. 

రాష్ట్ర మ్యారీటైం బోర్డు చైర్మన్ శ్రీ.దామచర్ల సత్య మాట్లాడుతూ... స్థిరాస్తి వివాదాలను పరిష్కరించి హక్కులను స్పష్టం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు మూలగుంటపాడు గ్రామంలో 108 సర్వే నెంబర్ విషయంలో నెలకొన్న సమస్యకు ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. యజమానులకు భూములపై స్పష్టమైన హక్కులను కల్పించామన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలంటే స్థిరాస్తికి సంబంధించిన వివరాలు సమగ్రంగా ఉండాలని, ఈ దిశగానే ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. భూ ఆక్రమణలు తొలగించి యజమానులకు పూర్తిస్థాయి హక్కులు కల్పించడానికి ప్రభుత్వం దృష్టి సారించింది అన్నారు. 

మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయకుమార్ మాట్లాడుతూ... భూ వివాదాలు పరిష్కరించాలని ప్రజల నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా స్వామిత్వ కార్యక్రమాన్ని ప్రభుత్వము చిత్తశుద్ధితో అమలు చేస్తున్నట్లు చెప్పారు. అధునాతన టెక్నాలజీ ఆధారంగా స్థిరాస్తులను వాటి హక్కుదారులతో ప్రభుత్వం మ్యాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
 

Post a Comment

Previous Post Next Post