మార్కాపురంలో కోర్టు భవనాల సముదాయం వర్చువల్ విధానంతో ప్రారంభించిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా మార్కాపురం, న్యాయస్థానాలలో ప్రజలకు సులభతరం గా సేవలందించడానికి అవసరమైన సౌకర్యా లు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు పరిపాలన న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మార్కాపురం కోర్టు భవనాల సముదాయం లో 6వ అడిషనల్ డిస్ట్రిక్ట్ మరియు సెషన్స్ జడ్జి భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హైకోర్టు పరిపాలన న్యాయ మూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూన్యాయ స్థానాల్లో న్యాయ సేవలు అందించడానికి అవసరమైనభవనా లను నిర్మిస్తామన్నారు. న్యాయమూర్తుల నివా సాలకుఅవసరమైన భవనాలు నిర్మించడాని కిచర్యలు తీసుకుంటా మని ఆయన చెప్పారు. మార్కాపురం జిల్లా కేంద్రం చేయాలని ఈ ప్రాంత ప్రజల నుండి డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో మార్కాపురం జిల్లా కేంద్రంలో కోర్టు భవనాలు నిర్మించ డానికి చర్యలు తీసు కుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జి. రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మార్కాపురంలో కోర్టు భవనాలు నిర్మించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. మార్కాపురం కోర్టు ప్రాంగణంలో భవనాల శంకుస్థాపనకు గతంలో ఇక్కడకు రావడం జరిగిందని చాలా తక్కువ వ్యవధిలో భవన నిర్మాణాలు పూర్తి చేశారని ఆయన చెప్పారు. సామాన్య ప్రజలకు న్యాయం అందించడానికి కోర్టు భవనాలు నిర్మించడం చాలా అవసరమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన మరో ముఖ్య అతిథి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ వై.లక్ష్మణరావు మాట్లాడుతూ మార్కాపురంలో మరో రెండు కోర్టు భవనాలు నిర్మించడం వల్ల ప్రజల ముంగిటికీ న్యాయ స్థానాలు వచ్చినట్లు ఉందని ఆయన అన్నారు. కోర్టుల్లో వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన అన్నారు. కోర్టు ప్రాంగణాల్లో అదనపు భవనాలు నిర్మించడం వల్ల కేసులు త్వరగా పరిష్కారమైతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.రాజాబాబు మాట్లాడుతూ జిల్లాల విభజన నేపథ్యంలో ప్రకాశం జిల్లా అతిపెద్ద జిల్లాగా ఏర్పడిందని ఆయన అన్నారు. జిల్లాలో 80 శాతం మంది ప్రజలు వ్యవసాయo మీద ఆధారపడి జీవిస్తుంటా రనిఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో భూములకు సంబంధించి సమస్యలు చాలా కోర్టులో పెండింగ్ లో ఉన్నాయని అని చెప్పారు.
మార్కాపురంలో అదనపు కోర్టు భవనాలు నిర్మించడం వల్ల కేసులు సులభ తరంగా పరిష్కారం చేయడానికి వీలలై తుందని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి, అదనపు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజా వెంకటాద్రి, న్యాయాధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

