ఐ వి ఆర్ యస్ కాల్స్ ద్వారా దరఖాస్తుదారులకు స్వయంగా ఫోన్ చేసి సమస్య తెలుసుకున్న డి.ఆర్.ఓ.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు ,శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి జిల్లా రెవెన్యూ అధికారి.
చిన ఓబులేసు, ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా పలువురు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక దరఖాస్తుదారులకు స్వయంగా ఫోన్ చేసి సమస్య పరిష్కార విధానంను తెలుసుకోవడం జరిగింది. సమస్య పరిష్కారంలో సంతృప్తి చెందారా.. లేదా అన్న విషయాన్నీ తెలుసుకోవడం తో పాటు సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి ఏ విధంగా సమస్యను పరిష్కరించారన్న వివరాలను అడిగితెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సంబంధిత ధరకాస్తుదారులు సంతృప్తి చెందారా లేదా అని ఐవిఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుసుకోవడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగానే దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం తో పాటు వారి స్పందనను తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి మాధురి, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
