శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలి: అన్నా రాంబాబు.


 శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలి: అన్నా రాంబాబు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మార్కాపురం జిల్లాలో పూర్వపు కర్నూలు జిల్లాలోని శ్రీశైలం క్షేత్రాన్ని కలిపి జిల్లా ప్రకటన చేయాలని వైఎస్సార్సీపీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త,గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్నా వెంకట రాంబాబు డిమాండ్ చేశారు.

మెడికల్ కాలేజీల నిర్మాణం,నిర్వహణ ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ,నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ తో నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతున్న కార్యక్రమంలో రాంబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ రాయలసీమలో అంతర్భాగంగా ఉన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకొని శ్రీశైలం క్షేత్రాన్ని మార్కాపురం జిల్లాలో అంతర్భాగం చేయాల్సిందేనన్నారు.

దీంతోపాటు కృష్ణానదీ జలాల ప్రాతిపదికగా నిర్మించిన వెలుగొండ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ ప్రదేశాన్ని కూడా మార్కాపురం జిల్లాలో ఉంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

ఈ రెండు అంశాలను మంత్రివర్గ ఉపసంఘం చర్చించి,తమ నివేదికలో చేర్చి ప్రభుత్వానికి సమర్పించాలని మార్కాపురం వైయస్సార్ సిపి సమన్వయకర్త అన్నా వెంకట రాంబాబు డిమాండ్ చేశారు.

Post a Comment

Previous Post Next Post