క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్ :10
దేవరాపల్లి మండలం తామారబ్బ యుపి స్కూల్ కు అదనంగా ఉపాద్యాయులు తరగతి గదులు బల్లలు సౌకర్యం కల్పిం చాలని,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న సోమవారం పిజిఆర్ఎస్ లో వినతి పత్రం సమర్పించారు అనంతరం అయిన వీలెకర్లుతో మాట్లాడారు దేవరాపల్లి మండలం తామారబ్బ పంచాయతీ యుపి స్కూల్ ను పరిశీలించామని ఈస్కూల్ లో 52 మంది విద్యార్ధిని విద్యార్థులు ఉన్నారని తెలిపారు వీరు అందరూ ఆదివాసీ గిరిజన తేగలకు చేందిన వారు అత్యదిక మంది ఉన్నారని అన్నారు వీరికి సరి పడా తరగతి గదులు లేవని, 1 నుండి 5 వరకు 30 మంది వరకు పిల్లలు ఉన్నారని 6,7,8 తరగతి వరకు 22 మంది విద్యార్ధిని విద్యార్థులు ఉన్నారని తెలిపారు ఈ 20 మందికి ఇంగ్లీషు లెక్కలకు మాత్రమే ఉపాద్యాయులు ఉన్నారని అన్నారు, తెలుగు హిందీ, సోషల్, సైన్స్ సబ్జెక్టులకు ఉపాద్యాయులు లెరన్నారు ఇద్దరు టిచర్లు 18 క్లాసులు చేబు తున్నారని, దీని వలన గిరిజన విద్యార్ధిని విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ చదువులకు దూరం అవుతు న్నారని ఆవేదన వ్యక్తం చేసారు దింతో పాటు తరగతి గదిలో కూర్చోవ డానికి బల్లలు లేవు ఇప్పటికే ప్రభుత్వం నాడు నేడు నిదులతో అభివృద్ధి చేసి పిల్లలు లేరని కోన్ని పాఠశాలలు మూసి వేసారు ఆపాఠశాలలో బల్లలు వ్రుదాగ ఉన్నాయని తెలిపారు ఆబల్లలు ఈపాఠశాలకు కేటాయింపు చేయ వచ్చునని గిరిజన విద్యార్దిని విద్యార్థులు సమస్యలు ద్రుష్టిలో పెట్టుకుని ఉపాద్యాయులు సమస్యతో పాటు తరగతి గదులు బల్లలు సమస్య పరిష్కారం చేయాలని వెంకన్న డిమాండ్ చేసారు.
